NZW vs BANW : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ బ్యాటర్ బ్రూక్ హల్లిడే (69) అర్ధ శతకంతో మెరిసింది. గువాహటి స్టేడియంలో బంగ్లాదేశ్ బౌలర్లను దంచేసిన తను హాఫ్ సెంచరీతో జట్టు భారీ స్కోర్‌కు బాటలు వేసింది. కెప్టెన్ సోఫీ డెవినె (46 నాటౌట్)తో కలిసి బ్రూక్.. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఎట్టకేలకు ఫాహిమా ఖాతూన్ విడదీసింది.
జోరుమీదున్న హల్లిడేను ఫాహిమా స్లో బాల్‌తో బోల్తా కొట్టించింది. క్యాచ్ అందుకోవడంతో నాలుగో వికెట్ 112 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటికీ వైట్ ఫెర్న్స్ స్కోర్.. 150. ప్రస్తుతం కెప్టెన్ డెవినెతో పాటు మ్యాడీ గ్రీన్ క్రీజులో ఉంది. డెత్ ఓవర్లలో వీరు దంచేస్తే కివీస్ స్కోర్ 220-230 వరకూ చేరే అవకాశముంది.
Brooke Halliday’s first World Cup fifty rescues New Zealand and gives them a platform to push 💪 pic.twitter.com/KEAVBrhBrG
— ESPNcricinfo (@ESPNcricinfo) October 10, 2025
వరల్డ్ కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన న్యూజిలాండ్‌కు మళ్లీ శుభారంభం దక్కలేదు. ఓపెనర్ జార్జియా ప్లిమ్మర్(4)ను రబెయా ఖాన్ ఔట్ చేసి తొలి వికెట్ అందించింది. ఆ తర్వాత సుజీ బేట్స్ (29) కూడా స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగింది. ఆల్‌రౌండర్ అమేలియా కేర్(1) సైతం ఒక్క పరుగుకే బౌల్డ్ కావడంతో 38కే మూడు వికెట్లు పడ్డాయి. దాంతో.. వైట్ ఫెర్న్స్ మిడిలార్డర్‌పై భారం పడింది. కష్టాల్లో పడిన జట్టును ఆదుకునేందుకు బ్రూక్ హల్లిడే(69) సాధికారిక ఇన్నింగ్స్ ఆడింది. కెప్టెన్ సోఫీ డెవినె(46 నాటౌట్)తో కలిసి స్కోర్ బోర్డును నడిపించిన తను.. కాస్త కుదురుకున్నాక గేర్ మార్చింది. బౌండరీలతో చెలరేగుతూ అర్ధ శతకం సాధించింది. అయితే.. ఫాహిమా ఓవర్లో వికెట్ కీపర్ చేతికి చిక్కింది. దాంతో.. కివీస్ పరుగుల ప్రవాహానికి బ్రేకులు పడ్డాయి.