Footballer breaks leg | బంతిని తన్నబోయి ప్రత్యర్థి కాలు విరగొట్టిన ఫుట్‌బాలర్.. ఆపై ఏం జరిగిందంటే..?
Footballer breaks leg : ఆటలో గెలుపు ఓటములే కాదు ఊహించని గాయాలు కూడా భాగమే. తాజాగా ఓ యువ ఫుట్‌బాలర్(Young Footballer) తీవ్ర గాయంతో మైదానం వీడాడు. ప్రత్యర్థి ఆటగాడు బలంగా కాలితో తొక్కడంతో అతడి కాలు విరిగిపోయింది. అవును.. కోపా లిబెర్టడోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. బ్రెజిల్ ఫ్లుమినెన్స్(Brazil Fluminense) జట్టు ఆటగాడు...
Footballer breaks leg : ఆటలో గెలుపు ఓటములే కాదు ఊహించని గాయాలు కూడా భాగమే. తాజాగా ఓ యువ ఫుట్‌బాలర్(Young Footballer) తీవ్ర గాయంతో మైదానం వీడాడు. ప్రత్యర్థి ఆటగాడు బలంగా కాలితో తొక్కడంతో అతడి కాలు విరిగిపోయింది. అవును.. కోపా లిబెర్టడోర్స్ టోర్నీ(Copa Libertadores)లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. బ్రెజిల్ ఫ్లుమినెన్స్(Brazil Fluminense) జట్టు ఆటగాడు మార్సెలో(Marcelo) అనుకోకుండా ప్రత్యర్థి జట్టు అర్జెంటినోస్ జూనియర్స్(Argentinos Juniors) డిఫెండర్ లుసియానో సాంచెజ్(Luciano Sanchez) ఎడమ కాలు గట్టిగా తొక్కాడు.
ఆట 56వ నిమిషంలో బంతిని తన్నబోయిన సమయంలో ఈ సంఘటన జరిగింది. దాంతో, లుసియానో ఒక్కసారిగా కుప్పకూలిపోయి నొప్పితో విలవిలలాడాడు. ఊహించని సంఘటనతో మార్సెలో షాక్ తిన్నాడు. వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. లూసియానోను పరీక్షించిన వైద్యులు , కాలు విరిగిపోయినట్టు గుర్తించారు. అతను కోలుకునేందుకు 8 నెలల నుంచి 12 నెలలు పట్టనుందని సమాచారం.
Dios mio https://t.co/LO8ezSX3Oe pic.twitter.com/V9a24dYGBu
— Usuarios siendo domados (@sindicatodedom4) August 1, 2023
బాధ భరించలేక ఏడుస్తున్న లూసియానోను చూసి మార్సెలో కంటతడి పెట్టుకున్నాడు. ఏడుస్తూనే మైదానం వీడాడు. ‘నేను ఈరోజు మైదానంలో నేను చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నా. సహచర ఫుట్‌బాలర్‌ను కావాలని గాయపరచలేదు. లుసియానో సాంచెజ్.. నువ్వు తొందరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నా’ అని మార్సెలో సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. అతడి పోస్ట్‌పై అర్జెంటీనా క్లబ్ స్పందిస్తూ.. ‘మనం ప్రత్యర్థులం. శత్రువులం కాదు’ అని కామెంట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు చెరొక గోల్ కొట్టాయంతే. దాంతో, 1-1తో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇవి కూడా చదవండి
Heighest Trophy Winners | క్రికెట్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు ముద్దాడిన కెప్టెన్లు.. టాప్‌లో ఇద్దరు మనోళ్లే
Stuart Broad | ఆఖరి బంతికి సిక్స్, వికెట్.. 146 ఏండ్ల క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

