Heighest Trophy Winners | క్రికెట్ చరిత్రలో అత్యధిక ట్రోఫీలు ముద్దాడిన కెప్టెన్లు.. టాప్‌లో ఇద్దరు మనోళ్లే
Heighest Trophy Winners : అత్యుత్తమ ప్రతిభాపాటవాలు, నాయకత్వ లక్షణాలతో జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్లు క్రికెట్లో చాలామందే కనిపిస్తారు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్(International Cricket) నుంచి లీగ్ క్రికెట్(League Cricket)ల వరకు జట్టును విజయపథాన నడిపి ట్రోఫీలు అందించిన సారథులు మాత్రం అతి కొద్దిమందే. వీళ్లలో ఇద్దరు భారత కెప్టెన్లు ఉండడం...
Heighest Trophy Winners : అత్యుత్తమ ప్రతిభాపాటవాలు, నాయకత్వ లక్షణాలతో జట్టును విజయవంతంగా నడిపించిన కెప్టెన్లు క్రికెట్లో చాలామందే కనిపిస్తారు. అయితే.. అంతర్జాతీయ క్రికెట్(International Cricket) నుంచి లీగ్ క్రికెట్(League Cricket)ల వరకు జట్టును విజయపథాన నడిపి ట్రోఫీలు అందించిన సారథులు మాత్రం అతి కొద్దిమందే. కొంతమంది కెప్టెన్లు టీ20 లాంటి లీగ్ క్రికెట్లో ఆడలేదు.. ఆడినా సుదీర్ఘకాలం కొనసాగకపోవడంతో వారి ఖాతాల్లో ఎక్కువ ట్రోఫీలు లేకుండా పోయాయి. మరికొందరు అంతర్జాతీయ క్రికెట్ కంటే లీగ్ క్రికెట్లోనే విజయవంతమైన స్కిప్పర్లుగా పేరు సంపాదించుకున్నారు. వీళ్లలో ఇద్దరు భారత కెప్టెన్లు ఉండడం విశేషం. అంతర్జాతీయ, లీగ్ క్రికెట్లో విజయవంతమైన, ఎక్కువ ట్రోఫీలు సాధించిన కెప్టెన్ల గురించి తెలుసుకుందాం.
అత్యధిక ట్రోఫీలను ముద్దాడిన కెప్టెన్ల జాబితాలో టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni)ది అగ్రస్థానం. అత్యద్భుతమైన నాయకత్వ లక్షణాలు కలిగిన ధోనీ జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు(ICC Trophy) అందించాడు. కెప్టెన్‌గా తొలిసారి 2007లో టీ20 ప్రపంచకప్ సాధించి పెట్టాడు. ఆ తర్వాత 2011లో ధోనీ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ వన్డే ప్రపంచకప్ అందుకుని చరిత్ర సృష్టించింది. అనంతరం 2013లో చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) ని కూడా ధోనీ దేశానికి అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లోనే కాదు.. ఆ తర్వాత ఐపీఎల్(IPL )లోనూ మహీ అదే జోరు కొనసాగించాడు.

చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ పలు ఐపీఎల్, చాంపియన్స్ లీగ్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా అతడి ఖాతాలో పది టైటిళ్లు ఉన్నాయి. 2010, 2011 ఐపీఎల్ సీజన్లలో చెన్నైకి టైటిళ్లు అందించిన ధోనీ ఆ తర్వాత ఏడేళ్ల పాటు నిరాశపరిచాడు. అయితే, 2014లో చాంపియన్స్ లీగ్‌లో జట్టును ముందుండి గెలిపించి రెండో చాంపియన్స్ ట్రోఫీని జట్టు ఖాతాలో వేశాడు.
ఐపీఎల్ ట్రోఫీతో మహేంద్రసింగ్ ధోనీ

రెండేళ్ల బ్యాన్ తర్వాత 2018లో జట్టు తిరిగి వస్తూనే ఐపీఎల్ టైటిల్ గెలిచి మూడో ట్రోఫీని సాధించింది. అటు తర్వాత 2021, 2023లో జట్టును విజయాల బాటపట్టించిన ధోనీ మరో రెండు టైటిళ్లు సాధించాడు. కెప్టెన్‌గా మొత్తంగా పది టైటిళ్లు సాధించి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
రోహిత్.. ఆరు టైటిళ్లు
ఒంటిచేత్తో విజయాలు అందించగల టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్‌శర్మ(Rohit Sharma) అంతర్జాతీయ క్రికెట్లో ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. అయితే.. ఐపీఎల్(IPL )లో మాత్రం విజయవంతమైన సారథిగా కొనసాగుతున్నాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians)కు కెప్టెన్‌గా వహిస్తున్న రోహిత్ జట్టుకు ఐదు ట్రోఫీలు అందించి ఆ ఘనత సాధించిన తొలి సారథిగా రికార్డులకెక్కాడు.
ఐదు ఐపీఎల్ ట్రోఫీలతో రోహిత్‌శర్మ

2013లో జరిగిన ఆరో ఎడిషన్‌లో మూడు విజయాలు, మూడు పరాజయాలతో జట్టు పరిస్థితి దయనీయంగా ఉన్న వేళ కెప్టెన్ అయిన రోహిత్ సంచలన బ్యాటింగ్, అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో జట్టును విజయాలబాట పట్టించి తొలి ట్రోఫీ అందుకున్నాడు. ఆ తర్వాత 2015, 2017, 2019, 2020లలో జట్టుకు ట్రోఫీలు అందించి రికార్డు సృష్టించాడు. వీటితోపాటు 2013లో చాంపియన్స్ లీగ్‌లోనూ జట్టును విజేతగా నిలిపాడు.
విండీస్ దిగ్గజం సరసన పాంటింగ్
ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా రికీ పాంటింగ్(Ricky Ponting) పేరు సంపాదించుకున్నాడు. అతను 2002లో జట్టు పగ్గాలు సాధించినప్పుడు అత్యంత విజయవంతమైన ఆస్ట్రేలియా కెప్టెన్‌గా రికార్డులకెక్కుతాడని ఎవరూ ఊహించలేకపోయారు. అద్భుతమైన బ్యాటింగ్‌కు తోడు అత్యద్భుత కెప్టెన్సీ నైపుణ్యం కలిగిన పాంటింగ్ 2003, 2007లలో దేశానికి వరుసగా రెండు ప్రపంచ కప్‌లు అందించిపెట్టాడు.
ప్రపంచ కప్ ట్రోఫీలతో రికీ పాంటింగ్

2003 ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టును 135 పరుగుల తేడాతో మట్టికరిపించి ప్రపంచ కప్‌ను ముద్దాడాడు. ఆ మ్యాచ్‌లో పాంటింగ్ 121 బంతుల్లో అంజేయంగా 140 పరుగులు చేశాడు. 2007లో వెస్టిండీస్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో మరోమారు జట్టును జగజ్జేతగా నిలిపాడు. దాంతో, వరుసగా రెండోసారి ఆ ఘనత సాధించిన వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్(clive lloyd) సరసన చేరాడు. ఇవే కాకుండా 2006, 2009లలో పాంటింగ్ సారథ్యంలోని కంగారూ జట్టు చాంపియన్స్ ట్రోఫీలు గెలుచుకుంది.
బ్రావో ఖాతాలో నాలుగు
కరీబియన్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో(dwayne bravo) విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. అతను 2004 నుంచి 2021 వరకు అంటే 17 సంవత్సరాలపాటు వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కెరీర్లో బ్రావో తన ఆల్‌రౌండర్ నైపుణ్యంతో జట్టుకు బోల్డన్ని విజయాలు అందించిపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌తోపాటు ఐపీఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) వంటివాటిలోనూ సత్తా చాటాడు.
డ్వేన్ బ్రావో

సీపీఎల్‌లో 97 మ్యాచ్‌లు 91 ఇన్నింగ్స్‌లలో 124 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా రికార్డులకెక్కాడు. దీంతో పాటు కెప్టెన్‌గా నాలుగు సీపీఎల్ ట్రోఫీలు అందుకున్నాడు. 2015-2018 మధ్య సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్()కు మూడు ట్రోఫీలు అందించిన బ్రావో.. 2021లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్()కు తొలి టైటిల్ అందించాడు.
వరుసగా రెండు ప్రపంచ కప్‌లు
విండీస్ జట్టు విజయవంతమైన కెప్టెన్‌గా క్లైవ్ లాయిడ్ (clive lloyd) రికార్డులకెక్కాడు. ఆయన సారథ్యంలోని విండీస్ జట్టు అరివీర భయంకరంగా ఉండేది. 1974-1985 మధ్య కరీబియన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ జట్టును ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కష్టసాధ్యంగా ఉండేది. లాయిడ్ కెప్టెన్సీ నైపుణ్యాలే అందుకు కారణం. 1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచ కప్‌లో విండీస్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా చాంపియన్‌గా అవతరించింది.
రెండు ప్రపంచ కప్ ట్రోఫీలతో క్లైవ్ లాయిడ్

మూడు ఇన్నింగ్స్‌లలో 104.63 స్ట్రైక్ రేట్‌తో 158 పరుగులు చేసిన లాయిడ్ జట్టును ముందుండి నడిపించాడు. ఆ తర్వాత 1979లోనూ మరోమారు విండీజట్టు జగజ్జేతగా నిలిచింది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించి రెండోసారి ప్రపంచ కప్ అందుకుంది. దాంతో, ప్రపంచ కప్‌ను వరుసగా రెండుసార్లు అందుకున్న కెప్టెన్‌గా లాయిడ్ రికార్డులకెక్కాడు.
ఐపీఎల్ టైటిళ్లతో గంభీర్
అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన టీమిండియా ఆటగాళ్లలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్(Gautam Gambhir) ఒకడు. భారత జట్టు టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. గంభీర్‌కు జట్టుకు రెగ్యులర్ కెప్టెన్‌గా సేవలు అందించే అవకాశం లభించలేదు. అయితే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రం కెప్టెన్‌గా సత్తా చాటాడు.
రెండు ఐపీఎల్ ట్రోఫీలతో గౌతం గంభీర్

ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్.. కేకేఆర్‌కు 2012, 2014లో రెండు టైటిళ్లు అందించాడు. ఫలితంగా అప్పటి వరకు రెండు ఐపీఎల్ ట్రోఫీలు అందించిన ధోనీ, రోహిత్ సరసన చేరాడు.
బిగ్‌బాష్ లీగ్ హీరో హెన్రిక్స్
ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో ప్రముఖ క్రికెటర్‌గా పేరుకెక్కిన మెయిసెస్ హెన్రిక్స్(Moises Henriques) అంతర్జాతీయ వేదికపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఆసీస్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 44 గేమ్స్ మాత్రమే ఆడిన హెన్రిక్స్ ఖాతాలో 636 పరుగులు, 17 వికెట్లు ఉన్నాయి. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో సిడ్నీ సిక్సర్స్ (సీసీ)కి ప్రాతినిధ్యం వహించిన హెన్రిక్స్ జట్టును రెండుసార్లు విజేతగా నిలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

