హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రగతినగర్ పుచ్చలపల్లి సుందరయ్య ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన మార్వెల్ ఆల్ఇండియా ఫిడే చెస్ టోర్నీలో భరత్‌కుమార్‌రెడ్డి విజేతగా నిలిచాడు. బుధవారం జరిగిన ఫైనల్ రౌండ్లో బద్రీనాథ్‌తో గేమ్‌ను భరత్ డ్రా చేసుకున్నాడు.
దీంతో తొమ్మిది రౌండ్లలో భరత్ 8 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. రాయ్ చౌదరీ, కర్తవ్య వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.