ఢిల్లీ : ఈ ఏడాది రెండో డబుల్స్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన భారత టెన్నిస్ స్టార్ యూకీ బాంబ్రీ.. ఆఖరి మెట్టుపై తడబడ్డాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న బోర్డెక్స్ చాలెంజర్ టోర్నీలో భాగంగా ఆదివారం ముగిసిన పురుషుల డబుల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ బాంబ్రీ, రాబర్ట్ గాలోవే (అమెరికా) ద్వయం..
6-7 (1/7), 6-7 (2/7)తో ఫ్రాన్సిస్కొ కాబ్రల్ (పోర్చుగల్)-లుకాస్ మీడ్లర్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలైంది.