కొచ్చి: ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) రెండో సీజన్లో బెంగళూరు టార్పడోస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో బెంగళూరు 3-1(15-10, 10-15, 15-13, 15-10) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌పై అద్భుత విజయం సాధించింది.
ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన బెంగళూరు..కోల్‌కతాను నిలువరించడంలో సఫలమైంది. కచ్చితమైన సర్వ్‌లకు తోడు చురుకైన బ్లాంకింగ్తో పాయింట్లు కొల్లగొట్టింది. ఈ క్రమంలో కోల్‌కతా పుంజుకునేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. శనివారం అహ్మదాబాద్ డిఫెండర్స్, కాలికట్ హీరోస్ మధ్య రెండో సెమీస్ జరుగుతుంది.