First Class Cricket | దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ విడుదల.. జనవరి 5న రంజీ ట్రోఫీ షురూ
First Class Cricket : ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో దేశవాళీ క్రికెట్(Domestic Cricket)కు లైన్ క్లియర్ అయింది. దాంతో, 2023-24 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ(Ranji Trophy) వచ్చే ఏడాది జనవరి 5న మొదలవ్వనుంది. అంతకంటే ముందే జూన్ 28 నుంచి దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ప్రారంభం....
First Class Cricket : ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో దేశవాళీ క్రికెట్(Domestic Cricket)కు లైన్ క్లియర్ అయింది. దాంతో, 2023-24 సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రతిష్ఠాత్మకమైన రంజీ ట్రోఫీ(Ranji Trophy) వచ్చే ఏడాది జనవరి 5న మొదలవ్వనుంది. అంతకంటే ముందే జూన్ 28 నుంచి దులీప్ ట్రోఫీ(Duleep Trophy) ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ పోటీల్లో ఆరు జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. జూలై 16న టైటిల్ విజేత ఎవరో తేలిపోనుంది.
ఆ తర్వాత దేవ్‌ధర్ ట్రోఫీ(Deodhar Trophy) జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు జరుగుతుంది. ఆ వెంటనే ఇరానీ కప్(Irani Cup) షురూ అవుతుంది. అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ పోటీలో రంజీ చాంపియన్స్ సౌరాష్ట్ర, రెస్టాఫ్ ఇండియా తలపడనున్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali) టీ20 ట్రోఫీ అక్టోబర్ 16న మొదలై నవంబర్ 6న మగుస్తుంది. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు జరుగుతుంది.
దులీప్ ట్రోఫీ – జూన్ 28 నుంచి జూలై 16 వరకు
దేవ్‌ధర్ ట్రోఫీ – జూలై 24 నుంచి ఆగస్టు 4 వరకు
ఇరానీ కప్ – అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు
సయ్యద్ ముస్తాక్ అలీ – అక్టోబర్ 16న మొదలై నవంబర్ 6న మగుస్తుంది.
2022-23 సీజన్లో రంజీ ట్రోఫీ గెలిచిన సౌరాష్ట్ర

విజయ్ హజారే ట్రోఫీ – నవంబర్ 23 నుంచి డిసెంబర్ 15 వరకు
రంజీ ట్రోఫీ – జనవరి 5న మొదలవుతుంది. ఫిబ్రవరి 23 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు.
రంజీ ట్రోఫీలో 2 గ్రూప్స్
రంజీ ట్రోఫీలో ఎలైట్, ప్లేట్ అని రెండు గ్రూప్‌లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లు 70 రోజుల పాటు జరగనుంది. ఈ మెగా టోర్నీ మార్చి 14న ముగుస్తుంది. ఫిబ్రవరి 19న లీగ్ మ్యాచ్‌లు పూర్తి అవుతాయి. ఆ తర్వాత నాలుగు రోజులకే (ఫిబ్రవరి 23న) నాకౌట్ మ్యాచ్‌లు ఉంటాయి. 2022-23 సీజన్ రంజీ చాంపియన్‌గా సౌరాష్ట్ర జట్టు నిలిచింది. ఫైనల్లో బెంగాల్ జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది.
ఇవి కూడా చదవండి
Ishan Kishan | నేషనల్ క్రికెట్ అకాడమీకి ఇషాన్ కిషన్.. ఎందుకంటే..?
Ashes Series | ఖవాజా అద్భుత సెంచరీ.. ఎడ్జ్‌బాస్టన్‌లో వంద కొట్టిన రెండో ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
Dasara Posters | టాలీవుడ్లో పండగ జోష్.. దసరా కానుకగా సందడి చేసిన కొత్త సినిమాల పోస్టర్లు చూశారా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

