BCCI : భారత పురుషుల క్రికెట్ చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్(Ajit Agarkar) పదవి కాలం త్వరలోనే ముగియనుంది. దాంతో, అతడు తనను మరికొన్ని రోజులు కొనసాగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)ని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. వచ్చే వన్డే ప్రపంచకప్ వరకూ తనకు పొడిగింపు ఇవ్వాలని అగార్కర్ విజ్ఞప్తి చేసినట్టు వస్తున్న కథనాలు వస్తున్నాయి. ఇదే విషయంపై కొందరు బీసీసీఐని సంప్రదించగా.. అదేం లేదని కొట్టిపారేసింది.
చీఫ్ సెలెక్టర్‌గా వస్తూనే తనదైన ముద్ర వేసిన అగార్కర్ అనతికాలంలోనే ఫలితాలను చూపించారు. నిర్మొహమాటంగా సీనియర్లకు చెక్ పెట్టి.. ప్రతిభావంతులైన కుర్రాళ్లకు అవకాశమిచ్చిన అతడు.. టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడనడంలో సందేహం లేదు. అయితే.. ఈ క్రమంలో ఎన్నో విమర్శలకు అతడు బలయ్యాడు. అయినా సరే నేనింతే అన్నట్టుగా ముందుకు సాగుతున్న అగార్కర్ పదవీ కాలం మరో ఆరు నెలల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తనకు వచ్చే వరల్డ్‌కప్ 2027వరకూ పొడిగింపు ఇవ్వాలని బీసీసీఐని కోరినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే.. బీసీసీఐ అదికారుల మాత్రం అవన్నీ అవాస్తవాలని చెబుతున్నారు.
This is Ajit Agarkar, who was appointed as the chief selector of the Indian men’s cricket team in 2023. After that, the team found success in 2024, so his tenure was extended by one year. Now in 2026, his term is coming to an end, and he has again requested the BCCI to keep him… pic.twitter.com/Yv6xMXJmxQ
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026
‘బీసీసీఐతో అగార్కర్ మాట్లాడారు. అయితే.. తన పదవీ కాలం పొడిగించాలని మాత్రం అతడు అడుగలేదు. సెలెక్షన్ కమిటీ అనేది బీసీసీఐలో ఒక సబ్ కమిటీ. ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ సెలెక్టర్ల కాంట్రాక్ట్ వర్తిస్తుంది. అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ సైతం సెప్టెంబర్‌లోనే ముగుస్తుంది. ఆ తర్వాతే బీసీసీఐ సెక్రటరీ, అగార్కర్.. పొడిగింపుపై నిర్ణయానికి వస్తారు. బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం సీనియర్ సెలెక్టర్ నాలుగేళ్ల వరకు కొనసాగవచ్చు’ అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

మాజీ పేసరైన అగార్కర్ 2014లో చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికయ్యారు. అతడి బృందంలో ఎస్ఎస్ దాస్, ఆర్సీ సింగ్, అజయ్ రత్రా, ప్రజ్ఞాన్ ఓఝాలు ఉన్నారు. అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా వచ్చినప్పటి నుంచి భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో అదరగొట్టింది. టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కొల్లగొట్టిన టీమిండియా.. తాజాగా స్వదేశంలో టీ20 ప్రపంచకప్ గెలుపొందింది.