WPL Auction 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం తేదీ విడుదల.. మనీ పర్స్ వాల్యూ పెంపు
WPL Auction 2024: ఇదివరకే ఐపీఎల్ వేలం ప్రక్రియ జోరందుకోగా తాజాగా.. వచ్చే సీజన్‌కు గాను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది.
WPL Auction 2024: వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తిరిగి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మీద దృష్టి సారించింది. ఇదివరకే ఐపీఎల్ వేలం ప్రక్రియ జోరందుకోగా తాజాగా.. వచ్చే సీజన్‌కు గాను డబ్ల్యూపీఎల్ వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. డిసెంబర్ 09న ముంబై వేదికగా డబ్ల్యూపీఎల్ వేలం జరుగుతుందని చెప్పిన బీసీసీఐ.. ఈసారి ఫ్రాంచైజీల పర్స్ వాల్యూను కూడా పెంచి శుభవార్త చెప్పింది.
డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ విజయవంతమైన నేపథ్యంలో రెండో సీజన్‌ను మరింత ఆసక్తిగా మార్చేందుకు గాను బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. ఈసారి డబ్ల్యూపీఎల్.. బెంగళూరు, ముంబై వేదికగా నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అంతేగాక గతేడాది రూ. 12 కోట్లుగా ఉన్న ఒక్కో ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను ఈ ఏడాది రూ. 13.5 కోట్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 1.5 కోట్లు అధికం.
డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీలన్నీ ఇదివరకే తాము రిటైన్, రిలీజ్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన విషయం విదితమే. ఐదు ఫ్రాంచైజీలు గత సీజన్లో తమతో ఆడిన 60 మంది క్రికెటర్లను రిటైన్ చేసుకుని 29 మంది విడుదల చేశాయి. రిటైన్ చేసుకున్నవారిలో 21 మంది విదేశీ క్రికెటర్లున్నారు. రిటైన్, రిలీజ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్ వాల్యూ వివరాలు..
🥁 𝐌𝐚𝐫𝐤 𝐲𝐨𝐮𝐫 𝐂𝐚𝐥𝐞𝐧𝐝𝐚𝐫𝐬!
🔨 #TATAWPL Auction
🗓️ 9th December 2023
📍 Mumbai pic.twitter.com/rqzHpT8LRG
— Women’s Premier League (WPL) (@wplt20) November 24, 2023
ఢిల్లీ క్యాపిటల్స్ – రూ. 2.25 కోట్లు, అందుబాటులో ఉన్న స్లాట్స్ – 3
గుజరాత్ జెయింట్స్ – రూ. 5.95 కోట్లు, స్లాట్స్ – 10
ముంబై ఇండియన్స్ – రూ. 2.1 కోట్లు, స్లాట్స్ – 5
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రూ. 3.35 కోట్లు, స్లాట్స్ – 7
యూపీ వారియర్స్ – రూ. 4 కోట్లు, స్లాట్స్ – 5
ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను (9 స్లాట్స్ విదేశీ క్రికెటర్లకు) దక్కించుకునేందుకు రూ. 71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నోముల రిషితకు రూ.55 వేల ఆర్థిక సాయం
Singapore haze | సింగపూర్‌లో 15 రోజులుగా దట్టమైన పొగమంచు.. అనారోగ్యకర స్థాయిలో గాలి నాణ్యత..!
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

