Commonwealth Games | కామన్వెల్త్ క్రీడలలో మన మహిళా క్రికెట్ సైన్యమిదే..
ఈ నెల 28 నుంచి ఇంగ్లండ్ లోని బర్మింగ్హమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్ ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్ లో క్రికెట్ పోటీలు జరుగుతాయి. ఈ మేరకు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ తాజాగా వెల్లడించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథిగా వ్యవహరించబోతున్న ఈ జట్టుకు స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా ఉండనుంది.
మంధాన, షఫాలీవర్మ, ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన, సప్నా భాటియా, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్ లు బ్యాటర్లు కాగా స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, రాధా యాదవ్, మేఘనా సింగ్ లు బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, పూజా వస్త్రకార్ లు ఆల్ రౌండర్ పాత్ర పోషించనున్నారు. 15 మందితో పాటు సిమ్రాన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్ లు స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపికయ్యారు.
ఇటీవలే శ్రీలంకను వారి స్వదేశంలో వరుసగా టీ20, వన్డేలలో ఓడించి సిరీస్ లు నెగ్గిన టీమిండియా.. ఆ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో కామన్వెల్త్ క్రీడల్లో బరిలోకి దిగుతున్నది. ఇక టీమిండియా మాజీ సారథి మిథాలీ రాజ్ ఆట నుంచి నిష్క్రమించిన తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ కు అసలైన పరీక్ష కామన్వెల్త్ లో ఎదురుకానుంది.
కామన్వెల్త్ క్రీడలకు భారత జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తనియా సప్న భాటియా, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రకార్, మేఘనా సింగ్, రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా.
స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రన దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్
రెండు గ్రూపులుగా విడదీసిన ఈ క్రీడలలో గ్రూప్-ఏ లో భారత్ ఉంది. భారత్ తో పాటు బార్బోడస్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లు ఉన్నాయి. రెండు గ్రూప్ లలో టాప్-2 గా ఉన్న జట్లు సెమీస్ చేరతాయి.
భారత షెడ్యూల్ :
- జులై 29న ఆస్ట్రేలియా తో తొలి మ్యాచ్
- జులై 31న పాకిస్తాన్ తో రెండో మ్యాచ్
- ఆగస్టు 3న బార్బోడస్ తో మూడో మ్యాచ్ (భారత్ ఆడే మ్యాచులన్నీ ఎడ్జబాస్టన్ లోనే జరుగుతాయి)
🚨 NEWS 🚨: #TeamIndia (Senior Women) squad for Birmingham 2022 Commonwealth Games announced. #B2022 | @birminghamcg22 pic.twitter.com/lprQenpFJv
— BCCI Women (@BCCIWomen) July 11, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

