RSA vs AUS | సెంచరీతో పోరాడిన కెప్టెన్ బవుమ.. తొలి వన్డేలో ఆసీస్ టార్గెట్..?
RSA vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా(South Africa) టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, ఆతిథ్య జట్టు 222 పరుగులు ఆలౌటయ్యింది. కెప్టెన్ తెంబ బవుమ( 114 నాటౌట్ : 142 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్) శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి...
RSA vs AUS : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా(South Africa) టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో, ఆతిథ్య జట్టు 222 పరుగులు ఆలౌటయ్యింది. కెప్టెన్ తెంబ బవుమ( 114 నాటౌట్ : 142 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్స్) శతకంతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి సహకరించేవాళ్లు కరువవ్వడంతో సఫారీ జట్టు కుప్పకూలింది. కంగారు జట్టు బౌలర్లలో హేజిల్‌వుడ్ మూడు, స్టోయినిస్ రెండు వికెట్లు తీశారు.
టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ సఫారీలకు బ్యాటింగ్ అప్పగించాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్(11)ను స్టోయినిస్ ఔట్ చేశాడు. అక్కడితో మొదలు వచ్చిన వాళ్లు వచ్చినట్టు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వాన్ డెర్ డస్సెన్(8), ఎయిడెన్ మరక్రం(19), క్లాసెన్(14) నిరాశ పరిచారు.
A stunning unbeaten ton from Temba Bavuma lifted the South Africa innings 💪#SAvAUS 📝: https://t.co/HDjW5bYoSv pic.twitter.com/Oh1H5g1nbn
— ICC (@ICC) September 7, 2023
ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఒక్కడే 32 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత చివరి వికెట్‌గా వచ్చిన ఎంగిడితో కలిసి బవుమా పోరాడాడు. ఆడం జంపా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎంగిడిని హేజిల్‌వుడ్ బౌల్డ్ చేయడంతో సఫారీ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
ఇవి కూడా చదవండి
MS Dhoni | యూఎస్ ఓపెన్ విజిటర్స్ గ్యాలరీలో ధోనీ.. అభిమాన ఆటగాడి కోసమేనా..?
King’s Cup 2023 | భారత జట్టుకు షాక్.. కింగ్స్ కప్ సెమీ-ఫైనల్లో ఊహించని ఓటమి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

