న్యూఢిల్లీ: క్రికెట్లో అరుదైన వస్తువులకు ఎంత విలువ ఉంటుందో మరోమారు రుజువైంది. క్రిక్ఫ్లిక్స్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన నాన్ ఫంజిబుల్ టోకెన్(ఎన్ఎఫ్టీ) వేలంలో 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన బ్యాట్ ఏకంగా రూ.18.84 లక్షలు పలికింది. దీనికి తోడు 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ జెర్సీ రూ.22.60 లక్షలకు పలుకగా, సచిన్ 200వ టెస్టు డిజిటల్ హక్కులను అమల్ఖాన్ రూ.30 లక్షలకు సొంతం చేసుకున్నాడు.