శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Feb 09, 2020 , 13:11:42

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: భారత్‌ బ్యాటింగ్‌

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌: భారత్‌ బ్యాటింగ్‌

అండర్‌-19 ప్రపంచకప్‌ ఆఖరి సమరం ఆరంభమైంది. #| #INDvBAN

పోచెఫ్‌స్ట్రూమ్‌: అండర్‌-19 ప్రపంచకప్‌ ఆఖరి సమరం ఆరంభమైంది. నాలుగు సార్లు విజేతగా నిలిచిన జట్టు ఒక వైపు.. ఇప్పటి వరకు వరల్డ్‌కప్‌ టోర్నీలో కనీసం ఫైనల్‌కు కూడా చేరని టీమ్‌ మరోవైపు. బంగ్లాదేశ్‌ తుదిపోరుకు చేరడం ఇదే మొదటిసారి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రెండు జట్లు సమంగా కనిపిస్తున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది.  టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ అక్బర్‌ అలీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. సెమీఫైనల్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నట్లు యువ భారత్‌ సారథి ప్రియం గార్గ్‌ తెలిపాడు. 

మిస్టర్‌ డిపెండబుల్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మార్గనిర్దేశంలో అదరగొడుతున్న యువ భారత్‌ మరో విజయం సాధిస్తే.. రికార్డు స్థాయిలో ఐదోసారి ప్రపంచకప్‌ మన ఒడిలో చేరనుంది. యశస్వితో పాటు దివ్యాన్ష్‌ సక్సేనా, తిలక్‌ వర్మ, ప్రియం గార్గ్‌, ధృవ్‌ జురేల్‌, సిద్ధేశ్‌ వీర్‌ బ్యాటింగ్‌లో మెరిస్తే.. భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్‌లో కార్తీక్‌ త్యాగికి రవి బిష్ణోయ్‌, అథర్వ అంకొలేకర్‌, ఆకాశ్‌ సింగ్‌ సహకరిస్తే.. యువభారత్‌కు తిరుగుండదు.logo