బీసీబీ అధ్యక్షుడిగా తమీమ్ ఇక్బాల్
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడిగా ఆ జట్టు మాజీ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ నియమితుడయ్యాడు. ఇటీవల కాలంలో వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాంను తొలగించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. తమీమ్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది.
- అమినుల్ ఇస్లాం తొలగింపు
ఢాకా : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడిగా ఆ జట్టు మాజీ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ నియమితుడయ్యాడు. ఇటీవల కాలంలో వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచిన బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాంను తొలగించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం.. తమీమ్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది. నిరుడు అక్టోబర్‌లో ముగిసిన బీసీబీ ఎన్నికల్లో అవకవతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ అవి నిజమేనని తేల్చడంతో పాటు బోర్డు డైరెక్టర్ల ఎన్నిక సక్రమంగా జరుగలేదని తెలపడంతో అమినుల్‌కు ఉద్వాసన తప్పలేదు.
ఇదీగాక ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ మంకుపట్టు పట్టి టోర్నీ నుంచి వైదొలగడంలో తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు అసిఫ్ నజ్రుల్, అమినుల్ పాత్ర ఉన్నదని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం అతడిపై వేటు వేసి 11 మందితో కూడిన అడ్‌హక్ కమిటీని నియమించింది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా తమీమ్ వ్యవహరించనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

