న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా వేటు పడింది. డోపింగ్ పరీక్ష కోసం శాంపిల్స్ ఇవ్వని కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) మంగళవారం బజరంగ్పై నాలుగేండ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టు సెలెక్షన్స్ ట్రయల్స్ సందర్భంగా గత మార్చి 10న జరిపిన డోపింగ్ టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చేందుకు పునియా నిరాకరించిన కారణంగా నాడా ఈ నిర్ణయానికి వచ్చింది.
దీంతో ఇప్పటి నుంచి పునియా ఎలాంటి పోటీల్లో బరిలోకి దిగే అవకాశం లేదని నాడాకు చెందిన యాంటీ డిసిప్లీనరీ డోపింగ్ ప్యానెల్(ఏడీడీపీ) పేర్కొంది.