NZ vs SL | బెయిల్స్ కింద పడినా అంపైర్ ఔట్ ఇవ్వలేదు.. కారణం ఎంటంటే..?
న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బెయిల్స్ కింద పడినా కూడా శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను అంపైర్ రనౌట్‌గా ప్రకటించలేదు. దాంతో, కివీస్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని అభిమానులంతా ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందంటే..?
NZ vs SL : న్యూజిలాండ్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. బెయిల్స్ కింద పడినా కూడా శ్రీలంక ఆటగాడు కరుణరత్నేను అంపైర్ రనౌట్‌గా ప్రకటించలేదు. దాంతో, కివీస్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని అభిమానులంతా ఆశ్చర్యపోయారు. అసలేం జరిగిందంటే..? కివీస్ ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతికి చమిక కరుణరత్నే (chamika karunaratne) మిడాప్ దిశగా షాట్ ఆడాడు. రెండో రన్‌కు ప్రయత్నించాడు. కానీ, సాధ్యం కాకపోవడంతో నాన్ స్ట్రైక్ వపు పరుగు తీశాడు.
అప్పటికే బంతి అందుకున్న టిక్నర్ వికెట్లను గిరాటేశాడు. బెయిల్స్ కూడా కిందపడ్డాయి. కానీ, లైట్స్ వెలగలేదు. దాంతో, అంపైర్ కరుణరత్నేను నాటౌట్‌గా ప్రకటించాడు. దాంతో, కివీస్ ఆటగాళ్లు షాకయ్యారు. ఔట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే..? బెయిల్స్ కింద పడ్డప్పుడు అవి వెలుగుతాయి. కానీ, బ్యాటరీ చార్జింగ్ అయిపోవడంతో అవి వెలగలేదు. దాంతో, అంపైర్ కరుణరత్నేను ఔట్ ఇవ్వలేదు.
ఎనిమిదేళ్ల రికార్డు బ్రేక్
టెస్టు సిరీస్‌లో శ్రీలంక(Srilanka)ను చిత్తు చేసిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో రికార్డు విజయం సాధించింది. ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో 198 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో, ఎనిమిదేళ్ల రికార్డును బ్రేక్ చేసింది. 2015 జనవరి 25న శ్రీలంకను 120 పరుగుల తేడాతో బ్లాక్‌క్యాప్స్ చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 274 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఆ జట్టులో రచిన్ రవీంద్ర (49) టాప్ స్కోరర్. కరుణరత్నే నాలుగు వికెట్లతో రాణించాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను హెన్రీ షిప్లే(Henry Shipley), బ్లెయిర్ టిక్నర్ దెబ్బకొట్టారు. షిప్లే ఐదు వికెట్లు తీసి శ్రీలంకను ఓటమి అంచుల్లోకి నెట్టాడు. రెండో వన్డే మార్చి 28న క్రిస్ట్‌చర్చ్‌లో జరగనుంది.
Not out 🏏 due to dead battery 😂#SparkSport #NZvSL pic.twitter.com/tYE044lemd
— Spark Sport (@sparknzsport) March 25, 2023
ఇవి కూడా చదవండి
Boora Saweety | ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బూర సవీటికి గోల్డ్ మెడల్.. ఫైనల్లో చైనా బాక్సర్‌పై గెలుపు
WPL Final 2023 | ముంబైతో ఫైనల్ పెద్ద ఛాలెంజ్.. షఫాలీ వర్మ చెలరేగితే విజయం మాదే : ఢిల్లీ కెప్టెన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
Chandrababu | బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిది.. వైసీపీకి చంద్రబాబు హెచ్చరిక
విశ్వామిత్ర చౌహాన్ సేవలు అభినందనీయం : అదనపు కలెక్టర్ వేణుగోపాల్
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

