నాలుగు పరాజయాల తర్వాత ఐపీఎల్లో బోణీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేగా వేలంలో రూ. 14 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన పేస్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా ఇప్పటి వరకు లీగ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని దీపక్.. ఇక ముందు కూడా మైదానంలోకి దిగడని లీగ్ వర్గాలు పేర్కొన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడ్డ దీపక్ చాహర్.. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు.