Babar Azam | వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ఏడేండ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టుకు మన దేశంలో చక్కటి ఆతిథ్యం లభిస్తున్నది. వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా పాకిస్థాన్ జట్టు తొలి పోరులో న్యూజిలాండ్‌తో తలపడుతున్నది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ షూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కివీస్‌తో పోరులో బాబర్ కుడి షూపై ‘వింక్’ ఎమోజీ దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు.. దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. కెమెరా పనితనం గొప్పగా ఉందని ఒకరు అంటే.. అచ్చం మ్యాచ్‌లో బాబర్‌ను చూసినట్లే ఉంది ఈ ఎమోజీ అని మరొకరు స్పందించారు.
An “Emoji” in the shoes of Babar Azam. pic.twitter.com/Ww4TFpdmvh
— Johns. (@CricCrazyJohns) September 29, 2023
వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు నేరుగా హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పాకిస్థాన్.. తొలి వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు.. భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ శతకాలతో కదంతొక్కారు. కివీస్ బౌలర్లలో మిషెల్ శాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, లోకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. సెంచరీ అనంతరం రిజ్వాన్ రిటైర్డ్ హర్ట్ గా మైదానం వీడాడు.