Babar Azam: మాజీ క్రికెటర్లను కోర్టుకీడ్చనున్న పాకిస్థాన్ కెప్టెన్
Babar Azam: తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బాబర్ ఆజమ్.. మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్‌పై లీగల్ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌లో తొలి స్టేజ్‌లోనే ఇంటి దారి పట్టిన పాక్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక యూట్యూబర్లు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బాబర్ ఆజమ్.. వారిపై కూడా న్యాయపరమైన చర్యలకు పూనుకోనున్నట్లు తెలుస్తోంది.
లాహోర్: అమెరికాలో జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ దారుణమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించింది. సూపర్-8 దశకు చేరకుండానే ఇంటికి పయనమైంది. దీంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై అనేక మంది మాజీ క్రికెటర్లు తిట్టిపోశారు. అతని ప్రవర్తన వల్లే జట్టు రెండో దశకు చేరుకోలేకపోయినట్లు ఆరోపించారు. గతంలో బాబర్‌తో ఆడిన అహ్మద్ షెహజాద్‌తో పాటు యూట్యూబర్లు కూడా విమర్శలతో చెలరేగిపోయారు. ఈ నేపథ్యంలో వారందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా పదేపదే టార్గెట్ చేయడాన్ని బాబర్ తట్టుకోలేకపోయాడు. అది అతడి పర్ఫార్మెన్స్ ప్రభావం చూపింది. అతను ఎంతో మనో వేదనకు గురైనట్లు కూడా తెలుస్తోంది.
యూట్యూబర్లు, మాజీ క్రికెటర్ల చేసిన విరమ్శలకు చెందిన కామెంట్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు చెందిన న్యాయశాఖ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లో కామెంట్లను సేకరించిన తర్వాత పాక్ బోర్డు న్యాయపరమైన చర్యలకు పాల్పడనున్నది. మరో వైపు అమెరికాలో ఉన్న పాక్ క్రికెటర్లు కొందరు లాహోర్ చేరుకున్నారు. ప్రైవేటు ఎయిర్‌లైన్స్ ద్వారా వాళ్లు అల్లమా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. నసీమ్ షా, ఉస్మాన్ ఖాన్, వాహబ్ రియాజ్ ఇంటికి వచ్చేశారు. బాబర్, ఇమాద్ వాసిమ్, హరీశ్ రౌఫ్, షాదాబ్ ఖాన్, ఆజమ్ ఖాన్లు ఇంకా అమెరికాలోనే ఉన్నారు.
టీ20 వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించిన తర్వాత .. మాజీ తోటి సభ్యుడు అహ్మ్ షెహజాద్ పాక్ కెప్టెన్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని బాబర్ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పాకిస్థాన్ జట్టు నవంబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడనున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

