Azar met Urdu VC: ఉర్దూ వర్శిటీ వీసీతో అజారుద్దీన్ భేటీ
Azar met Urdu VC: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యూయూ) ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్‌ను...

(Azar met Urdu VC) హైదరాబాద్: మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్‌యూయూ) ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ సందర్శించారు. వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉర్దూ వర్శిటీ క్యాంపస్‌లోని క్రీడా సౌకర్యాలను అజార్ పరిశీలించాడు. వీరిద్దరి అనధికారిక సమావేశంలో గచ్చిబౌలిలోని వర్శిటీ క్యాంపస్‌లో క్రికెట్ మైదానం అభివృద్ధికి హెచ్‌సీఏ సహకరించాలని ప్రొఫెసర్ హసన్ తన కోరికను వ్యక్తం చేశారు. ఇది తమ విద్యార్థులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని, అలాగే, అసోసియేషన్ కూడా ఉపయోగించుకోవచ్చునని ప్రొఫెసర్ హసన్, అజార్‌తో చెప్పారు.
ఈ ప్రతిపాదనపై భారత మాజీ కెప్టెన్ ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. ఈ విషయాన్ని అసోసియేషన్‌తో చర్చించి ముందుకు తీసుకెళ్లేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. వీరి భేటీలో ప్రొ-వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ ఎం రహమతుల్లా, స్పోర్ట్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్, డీపీఈ & స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎ కలీముల్లాలు కూడా పాల్గొన్నారు. వర్శిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ డైరెక్టరేట్‌ను 2011 లో స్థాపించారు. విద్యార్థులు, సిబ్బంది కోసం క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, టీటీ, చెస్ వంటి క్రీడాసౌకర్యాలను అందుబాటులో ఉంచారు. వ్యాయామశాలతో కూడిన మన్సూర్ అలీ ఖాన్ పటౌడి ఇండోర్ స్టేడియం, క్రికెట్, ఫుట్‌బాల్ ఆడేందుకు అవుట్డోర్ ధ్యాన్‌చంద్ స్పోర్ట్స్ గ్రౌండ్స్ కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

