హైదరాబాద్, ఆట ప్రతినిధి: హుసేన్సాగర్ వేదికగా జాతీయ మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం జరిగిన గ్రీన్ఫ్లీట్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ దత్తత తీసుకున్న ఇద్దరు హర్యానా సెయిలర్లు ఆయుకుమార్, సాక్షి చౌన్కర్ దాదాపు స్వర్ణ పతకాలను ఖాయం చేసుకున్నారు.
వీరిద్దరు తమ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచి సత్తాచాటారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ప్రిన్సిపల్ రేస్ ఆఫీసర్ చతుర్వేది కొన్ని పోటీలను ఆపేశారు. మిగతా విభాగాల్లో పోటీలు ముగిసే సరికి అండర్-19జూనియర్స్ మిక్స్డ్ డబుల్స్‌లో తనుజ-శ్రవణ్ జోడీ 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బాలుర అండర్-19 కేటగిరీలో హృదయ్ జోషి-కార్తీక్ ద్వయం(17), అండర్-18 బాలుర లేజర్ విభాగంలో శరణ్యయాదవ్(12), బాలికల కేటగిరీలో అలియా సబ్రిన్(12) టాప్‌లో ఉన్నారు.