మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సిన్నర్ సెమీఫైనల్స్ చేరాడు. రాడ్లీవర్ ఎరీనా వేదికగా బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఈ ఇటలీ కుర్రాడు.. 6-3, 6-2, 6-1తో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ డి మినార్‌పై అలవోకగా గెలిచాడు. మరో మ్యాచ్‌లో అమెరికా యువ సంచలనం బెన్ షెల్టన్.. 6-4, 7-5, 4-6, 7-6 (7/4)తో లొరెంజజో(ఇటలీ)ని ఓడిం చి ఈ టోర్నీలో తొలిసారి సెమీస్‌కు అర్హత సాధించాడు. సెమీస్ పోరులో షెల్టన్.. సిన్నర్‌తో తలపడనున్నాడు.
మహిళల సింగిల్స్‌లో పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్.. ఈ టోర్నీలో తన ఆధిపత్యాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. క్వార్టర్స్ పోరులో స్వియాటెక్ 6-1, 6-2తో ఎమ్మా నవర్రొ (యూఎస్ఏ)ను చిత్తుచేసింది.మరో మ్యాచ్‌లో 19వ సీడ్ మాడిసన్ కీస్ 3-6, 6-3, 6-4తో ఎలీనా స్వితోలినా(ఉక్రెయిన్)ను ఓడించి సెమీస్ చేరింది. సెమీస్‌లో స్వియాటెక్, కీస్ అమీతుమీ తేల్చుకోనున్నారు.