సురక్షితంగా స్వదేశం చేరుకున్న ఆసీస్ క్రికెటర్లు..

సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఆస్ట్రేలియా క్రికెటర్లు సురక్షితంగా తమ దేశానికి చేరుకున్నారు. భారత్‌లో కరోనా ఉదృతి నేపథ్యంలో ఐపీఎల్‌ను అర్ధాంతరంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్లో ఆడేందుకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు .. రెండు వారాల పాటు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ నుంచి ఓ ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం సిడ్నీ చేరుకున్నారు. సుమారు 40 మంది ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించారు. స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, ప్యాట్ కమ్మిన్స్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ తో పాటు సపోర్ట్ స్టాఫ్, రికీ పాంటింగ్, మైఖేల్ స్లేటర్లు కూడా ఇవాళ సిడ్నీ చేరుకున్నట్లు స్థానిక మీడియా చెప్పింది. అయితే కోవిడ్‌తో బాధపడుతున్న మైఖేల్ హస్సే ఇంకా చెన్నైలోనే చికిత్స పొందుతున్నాడు. మే ఆరవ తేదీన ఆసీస్ క్రికెటర్లు మాల్దీవులకు వెళ్లిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Australian
- Sydney
- Warner
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

