మాల్దీవ్స్ వెళ్లనున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పాల్గొన్న కొంతమంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడుతుండడంతో ఈ లీగ్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో విదేశీ ఆటగాళ్లు బృందాలుగా ఏర్పడి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కొంతమంది ఇంగ్లాండ్ క్రికెటర్లు ఇప్పటికే లండన్ బయలుదేరి వెళ్లారు.
కరోనా విజృంభణ కారణంగా మే 15 వరకు భారత్ నుంచి ప్రయాణికులు ఎవరూ ఆస్ట్రేలియాకు రాకుండా అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో భారత్‌లో ఉన్న ఆసీస్ ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఆసీస్ ఆటగాళ్లు మాల్దీవ్స్ మీదుగా తమ దేశానికి వెళ్లాలనుకుంటున్నారు. త్వరలో చార్టర్డ్ విమానంలో మాల్దీవ్స్‌కు వెళ్లి, ఆస్ట్రేలియా సరిహద్దులను తెరిచే వరకు ఆక్కడే వేచి ఉండాలని క్రికెటర్లు నిర్ణయించుకున్నారని ఓ అధికారి బుధవారం తెలిపారు.
38 మంది సభ్యుల ఆస్ట్రేలియా బృందంలో ఆటగాళ్లు, కోచ్‌లు, అంపైర్లు, వ్యాఖ్యాతలు ఉన్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని దేశంలోకి అనుమతించే వరకు మాల్దీవ్స్‌లోనే ఉండటానికి ఆసక్తి చూపించారు. ‘ఆస్ట్రేలియన్లు అందరూ ఇవాళ ఢిల్లీలో కలుసుకుంటారు. అక్కడి నుంచి వారంతా చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా మాల్దీవులకు వెళతారని’ కేకేఆర్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

