టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. కేవలం 2 వికెట్లు కోల్పోయి 6.2 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 15 ఓవర్లకే ఆల్ అవుట్ అయి కేవలం 73 పరుగులే చేసి.. ఆస్ట్రేలియాకు 74 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరూన్ ఫించ్ ఇద్దరే ఆస్ట్రేలియాను గెలిపించారు. డేవిడ్ వార్నర్ 14 బంతుల్లో 18 పరుగులు చేశాడు. కెప్టెన్ ఫించ్… 20 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే.. ఇద్దరూ పెవిలియన్ చేరడంతో.. మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇద్దరూ బరిలోకి దిగారు. అందులో మార్ష్ 5 బంతుల్లో 16 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, ఇస్లామ్.. ఒక్కో వికెట్ తీశారు.
ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. 4 ఓవర్లు వేసి బంగ్లాదేశ్ కీలక వికెట్లు 5 తీసి.. కేవలం 19 పరుగులే అందించాడు జంపా.
Australia are one step closer to the semis 💪#T20WorldCup | #AUSvBAN | https://t.co/apDTWI2E8S pic.twitter.com/IDFScSBv07
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
Finch's enterprising knock of 40 comes to an end!
— T20 World Cup (@T20WorldCup) November 4, 2021
He is bowled by Taskin Ahmed.#T20WorldCup | #AUSvBAN | https://t.co/apDTWI2E8S pic.twitter.com/xmkdGIbq61