ODI World Cup | ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య గురువారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ముందు సౌతాఫ్రికా 312 పరుగుల విజయ లక్ష్యాన్ని పెట్టింది. తొలుత టాస్ గెలుచుకున్న సౌతాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఓపెనర్లుగా క్వింటన్ డీకాక్, టెంబా బవుమా (కెప్టెన్) బ్యాటింగ్కు వచ్చారు.
జట్టు స్కోర్ 108 పరుగులు, టెంబా బవుమా వ్యక్తిగత స్కోర్ 35 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 158 పరుగుల జట్టు స్కోర్- రసీ వాన్ డీర్ డసన్ 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రెండో వికెట్ నష్టపోయింది.
రెండు వికెట్లు కోల్పోయిన తర్వాత అడైన్ మార్క్క్రమంతో కలిసి క్వింటాన్ డీకాక్ జట్టు స్కోర్ పెంచడానికి క్రుషి చేశారు. జట్టు స్కోర్ 197 పరుగుల వద్ద డీకాక్ రూపంలో జట్టు మూడో వికెట్ కోల్పోయింది. నిర్దేశిత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది సౌతాఫ్రికా. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్ వెల్ చెరో రెండు, జోష్ హేజిల్ వుడ్, పాట్ కమిన్స్, అడం జంపా చెరో వికెట్ తీశారు.