ఆస్ట్రేలియా క్రికెటర్ పెద్ద మనసు.. ఆక్సిజన్ కోసం పీఎం కేర్స్‌కు విరాళం

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పేస్ బౌలర్, ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడుతున్న ప్యాట్ కమిన్స్ తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇండియాలో కరోనా దుస్థితిని గమనించిన అతడు.. హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ సరఫరా కోసం 50 వేల డాలర్లు (సుమారు రూ.37 లక్షలు) పీఎం కేర్స్‌కు విరాళంగా ఇచ్చాడు. అంతేకాదు ఐపీఎల్లో తన సహచర ఆటగాళ్లను కూడా విరాళం ఇవ్వాల్సిందిగా అతడు కోరాడు.
ఇండియాకు రావడాన్ని నేను ఎంతో ఇష్టపడతాను. ఇక్కడి వాళ్లు చాలా మంచి వాళ్లు. కానీ ఈసారి పరిస్థితులు ఇంత దారుణంగా ఉండటం నన్ను ఎంతగానో బాధపెడుతోంది అని కమిన్స్ ఒక ప్రకటనలో చెప్పాడు. కరోనా ఈ స్థాయిలో పెరిగిపోతున్న సమయంలో ఐపీఎల్ అవసరమా అని కొందరు చేస్తున్న విమర్శలపైనా కమిన్స్ స్పందించాడు.
చాలా మంది ఐపీఎల్ జరగడంపై విమర్శలు చేస్తున్నారు. కానీ భారత ప్రభుత్వం ఆలోచన మరోలా ఉంది. లాక్డౌన్లో ఉన్న ప్రజలు కొన్ని గంటల పాటైనా ఎంజాయ్ చేయడానికి ఐపీఎల్ పనికొస్తుంది అన్నది వాళ్లు ఆలోచన. మా వల్ల కోట్ల మందికి మేలు జరుగుతున్నందుకు చాలా సంతోషం. ఆ ఉద్దేశంతోనే ఆక్సిజన్ కొనుగోలు చేయడానికి పీఎం కేర్స్‌కు విరాళమిచ్చాను అని కమిన్స్ చెప్పాడు.
నా సహచర ఆటగాళ్లే కాదు, ప్రపంచంలో ఉన్న అందరిని ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను 50 వేల డాలర్లతో ఈ పని ప్రారంభిస్తున్నాను అని కమిన్స్ అన్నాడు. ఇప్పటికే ఓవైపు ఇండియాలో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళనతో ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంటిదారి పట్టిన సమయంలో కమిన్స్ ఈ విరాళం ఇవ్వడం విశేషం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

