లక్నో: భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు అనధికారిక తొలి టెస్టులో శుభారంభం చేసింది. లక్నో వేదికగా భారత ‘ఏ’ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 337/5 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
యువ ఓపెనర్ సామ్ కొన్స్టాస్ (109) శతకంతో కదం తొక్కగా కెల్లావె (88), కొనొలి (70 నాటౌట్) రాణించారు. భారత ‘ఏ’ బౌలర్లలో హర్ష్ దూబే (3/88) ఫర్వాలేదనిపించాడు.