IPL 2024 : ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్(Pat Cummins) మళ్లీ ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో ఆడేందుకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ వేలం(IPL 2024 Auction)లో తన పేరు నమోదు చేసుకుంటానని కమిన్స్ తెలిపాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్(T20 World Cup) ఉన్నందున ప్రాక్టీస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతడు వెల్లడించాడు.
‘నేను టీ20 క్రికెట్ ఎక్కువగా ఆడలేదు. కొన్నాళ్లు కూడా నేను అత్యుత్తమ టీ20 క్రికెట్ ఆడలేకపోయాననే బాధ ఉంది. అందుకని వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో నా పేరు రిజిష్టర్ చేయించుకుంటా. తద్వారా పొట్టి ప్రపంచ కప్ ముందు కొంత ప్రాక్టీస్ లభిస్తుందని భావిస్తున్నా. అంతేకాదు టీ20ల్లో నేను ఎలా బౌలింగ్ చేస్తాననేది తెలుసుకోవాలని ఉంది’ అని కమిన్స్ వెల్లడించాడు.
ప్యాట్ కమిన్స్
ఐపీఎల్లో కమిన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knigh Riders)కు ప్రాతినిధ్యం వహించాడు. 2022 వేలంలో కోల్‌కతా అతడిని రూ.7.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే.. సీజన్ మధ్యలోనే తొడ కండరాల గాయంతో స్వదేశానికి వెళ్లిన కమిన్స్.. 16వ సీజన్లో ఆడేందుకు ఆసక్తి చూపించలేదు. పొట్టి ప్రపంచ కప్ 2024 పోటీలకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ టోర్నీకి సమయం దగ్గర పడుతుండడంతో ఐసీసీ ఇప్పటికే మ్యాచ్ జరిగే వేదికలను ప్రకటించింది. మొత్తం 20 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో ఇంగ్లండ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.
భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అయితే.. భారత్, దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా రెండు ఓటములతో నిరాశపరిచింది. అయితే.. శ్రీలంకపై విజయంతో దారిలో పడ్డ కమిన్స్ సేన వరుస విజయాలతో సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది. అఫ్గనిస్థాన్ మ్యాక్స్‌వెల్(201 నాటౌట్) కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడడంతో కంగారూ జట్టు సెమీస్‌కు క్వాలిఫై అయింది. ఆరోసారి వలర్డ్ కప్ వేటలో ఉన్న ఆస్ట్రేలియా నవంబర్ 16న దక్షిణాఫ్రికాతో రెండో సెమీఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తోంది.