Athiya Shetty-KL Rahul | బాలీవుడ్ నటి అథియా శెట్టి (Athiya Shetty), టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) రిలేషన్ షిప్లో ఉన్నారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ ప్రేమ జంట గత కొన్ని రోజులుగా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటూ ఇప్పటకే పలుమార్లు వార్తలు వచ్చాయి. కాగా, తాజాగా ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది.
రాహుల్-అథియా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. జనవరి 23వ తేదీన వీరి వివాహం సునీల్ శెట్టి నివాసం ఖండాలాలో జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ వివాహ వేడుకకు అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీ నుంచి సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, జాకీ ష్రూఫ్ తదితరులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా క్రీడా రంగం నుంచి ధోనీ, కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.