Asia cup 2023 : క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ ఏడాది ఆసియా కప్(Asia cup 2023) వేదికపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్‌కు ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asian Cricket Council) అంగీకారం తెలిపినట్టు సమాచారం. తటస్థ వేదికపై మొండి పట్టు పట్టిన బీసీసీఐ(BCCI), పీసీబీ(Pakistan Cricket Board) చివరకు తమ మాట నెగ్గించుకున్నాయి. త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మేరకు పాక్ 4 మ్యాచ్‌ల(నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్థాన్)కు ఆతిథ్యం ఇవ్వనుంది.
ఈ 4 మ్యాచ్‌లు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరగనున్నాయి. మిగతావి శ్రీలంక గడ్డపై నిర్వహిస్తారు. దాయాదులైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ శ్రీలంకలో జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ కూడా లంకలోనే ఉంటుంది. అంతేకాదు ఈ ఏడాది భారతదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు పీసీబీ అభ్యంతరం తెలపకపోవడంతో ఐసీసీ సంతోషం వ్యక్తం చేసింది.
జై షా, నజం సేథీ
ఆసియా కప్ నిర్వహణపై గత ఐదారు నెలలుగా బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. తమ దేశం నుంచి ఆసియా కప్‌ను తరలిస్తే.. ఆసియాకప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోమని పీసీబీ అధ్యక్షుడు నజం సేథీ హెచ్చరించాడు. అయినా కూడా బీసీసీఐ అతడి మాటల్ని పట్టించుకోలేదు. చివరకు పీసీబీ హైబ్రిడ్ మాడ్లను తెరపైకి తెచ్చింది. దీనికి కూడా ఆసియన్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఒప్పుకోకుంటే తాము టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని నజం సేథీ తెలిపాడు. ఈ సమయంలోనే శ్రీలంక బోర్డు ఆసియా కప్ నిర్వహించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకుంది.