Ashwin : భారత మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) వీడ్కోలు పలికి నెలలు కావొస్తోంది. కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో అతడు ఉన్నపళంగా రిటైర్మెంట్ వార్తతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా స్పిన్ యూనిట్‌కు పెద్దన్నలా వ్యవహరించే అశ్విన్.. అంత తొందరగా నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులు అంతుచిక్కలేదు. ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్న యశ్ తాజాగా తన వీడ్కోలుపై మౌనం వీడాడు.
కొన్ని కారణాల వల్లనే తాను అర్ధాంతరంగా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగించాల్సి వచ్చిందని యశ్ తెలిపాడు. యూట్యూబ్ సిరీస్ కుట్టి స్టోరీస్‌లో వీడ్కోలు పలకడానికి కారణం ఏంటీ? అని రాహుల్ ద్రవిడ్ అడిగిన ప్రశ్నకు ఈ వెటరన్ క్రికెటర్ ఆసక్తికర సమాధానం చెప్పాడు.
Ravichandran Ashwin revealed the reason behind his sudden decision to retire mid-series in Australia.#TestCricket #RavichandranAshwin #TeamIndia #CricketTwitter pic.twitter.com/1wQWh68EGu
— InsideSport (@InsideSportIND) August 21, 2025
నిరుడు 2024 డిసెంబర్లో హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు అశ్విన్. సిరీస్ మధ్యలోనే దిగ్గజ స్పిన్నర్ అలా వైదొలగడం పలు సందేహాలకు తావిచ్చింది. కొన్ని నెలలుగా మౌనంగా ఉన్న అతడు ఎట్టకేలకు ఓపెన్ అయ్యాడు. ‘బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు ముగిసిన తర్వాత వీడ్కోలు బాంబ్ పేల్చాడు. సమయం రాగానే వీడ్కోలు పలకాలని అనుకున్నా. నేను జీవితంలో ఏ దశలో ఉన్నాను? అని ఆలోచించాను. నాకు వయసైపోతుందని గ్రహించాను. స్క్వాడ్‌తో పాటు విదేశీ పర్యటనలకు వెళ్లడం వరకూ బాగానే ఉంటుంది. కానీ, పదకొండు మందిలో లేకుండా ఎక్కువ రోజులు బెంచ్‌మీద కూర్చోవడం ఎంతో బాధిస్తుంది. నాకూ అదే పరిస్థితి ఎదురైంది. సో.. ఇక నా కెరీర్ ముగించేందుకు సమయం వచ్చిందని అర్ధమైంది. అందుకే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే ప్రకటన చేశాను’ అని అశ్విన్ పేర్కొన్నాడు.
R. Ashwin opens up on the call to retire from international cricket during the Border-Gavaskar Trophy in Australia.#Cricket pic.twitter.com/eal2WR23yY
— Wisden (@WisdenCricket) August 22, 2025
అంతేకాదు కుటుంబంతో గడపాలనే ఆలోచన కూడా వీడ్కోలు నిర్ణయానికి ఒక కారణమని ఈ స్పిన్ దిగ్గజం అన్నాడు. ‘దేశానికి ఆడకూడదనే ఆలోచన ఎప్పుడూ నాకు రాలేదు. కానీ, అదే సమయంలో కుటుంబానికి సమయం కేటాయించడం, పిల్లలతో గడపడం చాలా ముఖ్యమని భావించాను. నా ఇద్దరు కూతుళ్లు పెద్దవాళ్లు అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా కెరీర్‌ను పొడిగించడం కంటే వీడ్కోలు చెప్పడమే మంచిదని అనిపించింది. మరో విషయం నాకు 34-35 ఏళ్ల వచ్చాక రిటైరవ్వాలని కెరీర్ ఆరంభంలోనే అనుకున్నా. కానీ, కాస్త ఆలస్యం అయింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం’ అని అశ్విన్ వెల్లడించాడు. 106 టెస్టులు ఆడిన ఈ తమిళ తంబీ 537 వికెట్లు తీశాడు. ఎనిమిదిసార్లు పది వికెట్లు, 37సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడీ స్పిన్ లెజెండ్.
#Ashwin has announced his retirement from all forms of international cricket!
With 765 wickets across formats, he bows out as one of the greatest spinners of all time. Go well, @ashwinravi99 ! 🙌 pic.twitter.com/alfjOj4IDm
— Star Sports (@StarSportsIndia) December 18, 2024