ఇది శ్రీలంక క్రికెట్‌ను అవమానించడమే: అర్జున రణతుంగ

కొలంబో: శ్రీలంక టూర్ కోసం సెకండ్ రేట్ ఇండియన్ టీమ్‌ను పంపించడంపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది తమ క్రికెట్‌ను అవమానించడం కంటే ఏమాత్రం తక్కువ కాదని అన్నాడు. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని సీనియర్ టీమ్ ఇంగ్లండ్ టూర్లో ఉండగా.. శిఖర్ ధావన్ స్టాండిన్ కెప్టెన్‌గా మరో టీమ్ శ్రీలంక వెళ్లింది. ఇది సెకండ్ రేట్ ఇండియన్ టీమ్. వాళ్లు రావడం అనేది మన క్రికెట్‌ను అవమానించడమే అవుతుంది. అసలు దీనికి అంగీకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డును అనాలి. కేవలం టీవీ మార్కెటింగ్ అవసరాల కోసమే దీనికి ఓకే చెప్పారు అని రణతుంగా మండిపడ్డాడు.
ఇండియా తన బెస్ట్ టీమ్‌ను ఇంగ్లండ్‌కు పంపించి.. బలహీన టీమ్‌ను ఇక్కడికి పంపింది. ఇది మా బోర్డు తప్పిదమే అని స్పష్టం చేశాడు. ఇక ప్రస్తుతం శ్రీలంక టీమ్ దుస్థితిపైనా అతడు స్పందించాడు. ఈ మధ్యే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ కోల్పోయిన లంక.. వరుసగా ఐదు టీ20 సిరీస్‌లలో ఓటమి చవిచూసింది. ఆటగాళ్లలో క్రమశిక్షణ లేకపోవడం కూడా దీనికి కారణమవుతోందని, తాను బోర్డులో ఉన్నప్పుడు ఇలాంటి వాటిని అస్సలు అనుమతించలేదని అన్నాడు. లంక బోర్డును పూర్తిగా ప్రక్షాళణ చేయాలని డిమాండ్ చేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

