ఆలూరు (కర్నాటక): భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఒకే మ్యాచ్లో 9 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ కె తిమ్మప్పయ్య మెమొరియల్ టోర్నమెంట్ 2024-25లో భాగంగా కేఎస్సీఏతో జరిగిన మ్యాచ్లో అర్జున్ (9/87) విజృంభించాడు. గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ చెలరేగడంతో ఆ జట్టు 189 పరుగుల తేడాతో విజయం సాధించింది.