బీజింగ్ (చైనా): ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ గెలిచిన జోరుమీదున్న ప్రపంచ రెండో ర్యాంకర్ అరీనా సబలెంక (బెలారస్)కు చైనా ఓపెన్‌లో అనూహ్య షాక్ తగిలిం ది. ఈ టోర్నీ మహిళల క్వార్టర్స్‌లో సబలెంక.. 6-7 (5/7), 6-2, 4-6తో కరోలినా ముచో వా (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాభవం పాలైంది. దీంతో ఆమె 15 వరుస విజయాలకు బ్రేక్ పడ్డటైంది. సెమీస్‌లో ముచోవా.. చైనా అమ్మాయి కిన్వెన్ జంగ్‌తో తలపడనుంది. మరో సెమీస్ కోకో గాఫ్, పౌలా బడోసా మధ్య జరుగనుంది.