కన్సాస్ సిటీ : ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా(Argentina) తన హవా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఇంగ్లండ్‌తో రెండో సెమీఫైనల్లో మెస్సీ సేన తలపడనున్నది. అయితే డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా .. వరుసగా రెండోసారి టైటిల్ గెలవాలన్న దీక్షతో ఆడుతోంది. ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ ఇప్పటికే టోర్నీలో 7 గోల్స్ చేశాడు. అర్జెంటీనా ఆటగాళ్లు టోర్నీ కోసం చాలా ప్రిపేరయ్యారు. ఆహారం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆటగాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే, వాళ్లకు కావాల్సిన స్థానిక ఆహారాన్ని అందివ్వాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో అర్జెంటీనా జట్టు తమతో పాటు సుమారు 500 కేజీల బీఫ్‌ను తెప్పించుకున్నట్లు తెలిసింది. ఫిఫా వరల్డ్‌కప్ టోర్నమెంట్ కోసం అమెరికాలోని కన్సాస్ సిటీలో అర్జెంటీనా జట్టు బస చేస్తున్నది. అయితే ఆ సిటీకి అర్జెంటీనా నుంచి 500 కేజీల బీఫ్ సరఫరా అయినట్లు తెలుస్తోంది. ట్రైనింగ్‌లో ఆహారం కీలకం అన్న అంశాన్ని ఆ జట్టు ఫాలో అవుతోంది. ఇంటి లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ఉద్దేశంతో.. రకరకాల డిష్‌లను అర్జెంటీనా క్యాంపులో తయారు చేశారు. సంప్రదాయకర రీతిలో బీఫ్ డిష్‌లను ప్రిపేర్ చేస్తున్నారు. లోమో, వాసియో, ఎంట్రానా, మాతాంబ్రే, పెసిటో, అసడో డీ తిరా లాంటి బీఫ్ వంటకాలతో ఆటగాళ్లు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా ప్లానింగ్ చేసి ఆ మాంసాన్ని అమెరికాకు తీసుకొచ్చినట్లు చెప్పారు. బీఫ్ బార్బిక్యూ తింటున్న అర్జెంటీనా ఆటగాళ్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
🇦🇷🥩 The Argentinian players preparing for the semifinal against England eating Asado. pic.twitter.com/XAg28E3gme
— Ultras Clips (@ultras_clips) July 13, 2026