అంటల్యా: గత నెలలో ముగిసిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-2లో పతకాల పంట పండించిన భారత ఆర్చర్లు టర్కీలో జరుగుతున్న స్టేజ్-3 పోటీలలో మాత్రం నిరాశపరిచారు. గురువారం జరిగిన మెన్స్ కాంపౌండ్, ఉమెన్స్ కాంపౌండ్‌తో పాటు మెన్స్ రికర్వ్, ఉమెన్స్ రికర్వ్ టీమ్ ఈవెంట్స్‌లో ఆర్చర్ల గురి కుదురలేదు.
పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో అభిషేక్, రిషభ్ యాదవ్, ఒజాస్తో కూడిన భారత త్రయం.. 241-242తో చైనీస్ తైపీ ఆర్చర్ల చేతిలో ఓడిపోయింది. మహిళల విభాగంలో మధుర, జ్యోతి సురేఖ, తెలంగాణ అమ్మాయి తానిపర్తి చికితతో కూడిన భారత జట్టు.. కాంస్య పోరులో 238-239తో యూఎస్ఏ చేతిలో ఓడింది.