Asian Continental Qualification | ఆర్చర్ ధీరజ్‌కు రజతం.. ప్యారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారు
Asian Continental Qualification : భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర(Dhiraj Bommadevara) బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో రజత పతకంతో మెరిశాడు. దాంతో ఈ 22 ఏండ్ల విలుకాడు ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తు..
Asian Continental Qualification : భారత యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర(Dhiraj Bommadevara) బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్లో రజత పతకంతో మెరిశాడు. దాంతో ఈ 22 ఏండ్ల విలుకాడు ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics) బెర్తు కూడా దక్కించుకున్నాడు. దాంతో, మనదేశం నుంచి 2024 విశ్వక్రీడలకు అర్హత సాధించిన తొలి ఆర్చర్‌గా గుర్తింపు సాధించాడు. ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన జిహ్ సియాంగ్ లిన్‌తో పోటీపడిన ధీరజ్ 5-6 (29-28, 27-29, 28-28, 30-28, 25-26) (9-10) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
భారత సీనియర్ ఆర్చర్ తరుందీప్ రాయ్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కానీ, ధీరజ్ అంచనాలకు మించి రాణించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో అతడు ఇరాన్ ఆర్చర్ సదేగ్ అష్రఫీ బవిలీని ఓడించాడు. ఆ తర్వాత జరిగిన సెమీఫైనల్లో ఇరాన్‌కే చెందిన మహమ్మదోసీన్ గొల్షానీని చిత్తు చేశాడు.
నిరాశపరిచిన అంకిత
ఇక మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్లు ఒలింపిక్స్ దక్కించుకోలేకపోయారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన అంకిత భకత్(Ankita Bhakat) క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. ఉజ్బెకిస్థాన్ ఆర్చర్ జియోదఖాన్ అబ్దుసత్తరోవా చేతిలో 4-6 (29-23, 27-27, 24-25, 27-27, 24-26తో ఓటమి పాలైంది.
ఇవి కూడా చదవండి
-
CWC 2023: కొత్త రికార్డులు సృష్టిస్తున్న వరల్డ్ కప్.. వన్డే ఫార్మాట్ సేఫ్
-
Game Changer | మెగా ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ.. వాయిదా పడ్డ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్
-
Canada: కెనడాలో గ్యాంగ్‌వార్.. సిక్కు తండ్రీకొడుకుల కాల్చివేత
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

