Game Changer | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్. దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ మొదలైన దగ్గరనుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ రాలేదు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఒక సాంగ్ కూడా లీక్ అయ్యింది.
ఇక ఈ సాంగ్ లీక్ కారణంగా గతంలో చాలా ట్రెండ్ అయ్యింది. దీంతో లీగల్ యాక్షన్ తీసుకున్న మూవీ టీమ్.. వీలైనంత త్వరగా ఈ సాంగ్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ జరగండి అనే సాంగ్‌ను దీపావళికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందా అంటూ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. అయితే మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ చెబుతూ.. మేకర్స్ తాజాగా మరో ప్రకటన విడుదల చేశారు.
ఈ సాంగ్‌ను మొదట దీపావళికి రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సాంగ్ రిలీజ్ ఇప్పుడు వాయిదా పడింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఆడియో డాక్యుమెంటేషన్‌లో సమస్యలు వచ్చాయని.. ప్రస్తుతానికి రిలీజ్‌ను వాయిదా వేసి త్వరలోనే కొత్త డేట్ ని ప్రకటిస్తామని తెలిపింది. ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమా అభిమానులని మెప్పిస్తుందని, సినిమా కోసం చాలా మంది వర్క్ చేస్తున్నారని, మీకు బెస్ట్ ఇస్తామని మూవీ టీమ్ పేర్కొంది.
#GameChanger pic.twitter.com/UhrDpTrg9W
— Sri Venkateswara Creations (@SVC_official) November 11, 2023