PV Sindhu: బ్యాడ్మింటన్ స్టార్ సింధుకు ప్రైజ్‌మనీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఒలింపిక్స్‌లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu )కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.30 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. సింధు టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.

అమరావతి: ఒలింపిక్స్‌లో రెండో మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు( PV Sindhu )కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.30 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. సింధు టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర క్రీడా విధానంలో భాగంగా సింధుకు ఆ నగదు బహుమతి ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఏపీ క్రీడా విధానం ప్రకారం గోల్డ్ మెడల్ విజేతలకు రూ.75 లక్షలు, సిల్వర్ గెలిస్తే రూ.50 లక్షలు, బ్రాంజ్ గెలిస్తే రూ.30 లక్షలు ఇవ్వనున్నారు.
ఇంతకుముందే సింధుతోపాటు మరో బ్యాడ్మింటన్ ప్లేయర్ సాత్విక్‌సాయిరాజ్, హాకీ ప్లేయర్ రజనిలకు టోక్యో వెళ్లే ముందు రూ.5 లక్షలు ఇచ్చారు సీఎం జగన్. ఆ సమయంలోనే విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు చేయడానికి సింధుకు 2 ఎకరాల స్థలం కేటాయించినట్లు జగన్ ప్రకటించారు. ఇప్పటికే సింధు ఏపీ ప్రభుత్వ ఉద్యోగి. 2016లో ఆమె రియో గేమ్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు ఆమెకు డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఇచ్చారు. అంతేకాదు అప్పట్లో రూ.3 కోట్ల నగదు కూడా అందించారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుడు రూ.5 కోట్ల నగదు బహుమతిని సింధుకు ఇచ్చింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

