టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ రోజు 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిజయేస్తున్నారు. సోషల్ మీడియాలో విరాట్ పేరు మారుమ్రోగిపోతుంది. మరోవైపు ఈ రోజు స్కాట్లాండ్తో భారత్ మ్యాచ్ ఆడనుండగా, అందులో గెలిచి విరాట్‌కి ఘనమైన గిఫ్ట్ ఇవ్వాలని టీం సభ్యులు భావిస్తున్నారు.
ఇక విరాట్ జీవిత భాగస్వామి అనుష్క శర్మ తన భర్తని ప్రేమగా హత్తుకున్న ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోకు కూడా ఎలాంటి మెరుగులు అక్కర్లేదు. నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితులు వచ్చిన ధైర్యంగా ముందుకు వెళ్ళే ధైర్యం నీ సొంతం. నిరాశ నుంచి త్వరగా బయటపడే నీలాంటి వ్యక్తిని నేను చూడలేదు. నువ్వు రోజురోజుకి ఎదుగుతూనే ఉంటావు.
సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకునేంత తీరిక లేదని నాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు నీలాంటి వ్యక్తి మరొకరు లేరని ప్రపంచానికి బిగ్గరగా అరిచి చెప్పాలనిపిస్తుంది.. నువ్వంటే ఏమిటో తెలిసిన వాళ్లకు ఈ మాటలతో పనిలేదు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రకాశవంతంగా, అందంగా తీర్చిదిద్దుతున్నందుకు థాంక్యూ. హ్యాపీ బర్త్‌డే క్యూట్‌నెస్’’..అంటూ ఎంతో ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది అనుష్క. కాగా, విరుష్కగా అభిమానుల మనసులలో నిలిచిన ఈ జంట డిసెంబరు 11న ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఈ అందమైన జంటకు 2021, జనవరి 11న కూతురు వామికా జన్మించింది.