Allu Arjun | అల్లు అర్జున్‌కు ‘రెబల్ స్టార్’ ట్యాగ్?.. ఫోర్బ్స్ కవర్‌తో కొత్త వివాదం, ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్!
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి నేషనల్ లెవల్లో హాట్ టాపిక్‌గా మారారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ఆగస్టు ఎడిషన్ కవర్ పేజీపై అల్లు అర్జున్‌కు ప్రత్యేక స్థానం దక్కింది. అయితే ఈ కవర్ స్టోరీలో ఆయనను ‘రెబల్ స్టార్’ గా పేర్కొనడం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి నేషనల్ లెవల్లో హాట్ టాపిక్‌గా మారారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ఆగస్టు ఎడిషన్ కవర్ పేజీపై అల్లు అర్జున్‌కు ప్రత్యేక స్థానం దక్కింది. అయితే ఈ కవర్ స్టోరీలో ఆయనను ‘రెబల్ స్టార్’ గా పేర్కొనడం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క పదం సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. ఫోర్బ్స్ ఇండియా తన కవర్ స్టోరీలో అల్లు అర్జున్ను ‘రెబల్ స్టార్’గా సంబోధించడం పట్ల ప్రభాస్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ‘రెబల్ స్టార్’ అనే బిరుదు దివంగత నటుడు కృష్ణంరాజు నుంచి ప్రభాస్ వరకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపుగా కొనసాగుతోంది.
దశాబ్దాలుగా కృష్ణంరాజు, ప్రభాస్ అభిమానులతో ముడిపడి ఉన్న ఈ ట్యాగ్‌ను ఇప్పుడు అల్లు అర్జున్‌కు ఉపయోగించడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొంతమంది ప్రభాస్ అభిమానులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది కేవలం మ్యాగజైన్లో ఉపయోగించిన పదమేనని అంటున్నారు. ఈ వ్యవహారంపై మరో ఆసక్తికరమైన చర్చ కూడా మొదలైంది. సాధారణంగా ప్రముఖ మ్యాగజైన్ల కవర్ స్టోరీలు, ఫోటోషూట్లు, కథనాలు ప్రచురించే ముందు సంబంధిత సెలబ్రిటీ టీమ్‌తో సమన్వయం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ‘రెబల్ స్టార్’ అనే పదం ఎలా వచ్చింది? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
ఇది ఫోర్బ్స్ ఎడిటోరియల్ టీమ్ నుంచి జరిగిన పొరపాటా? లేక కవర్ స్టోరీకి మరింత ప్రచారం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పదాన్ని ఉపయోగించారా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ అంశంపై అధికారికంగా ఎలాంటి స్పష్టత వెలువడలేదు. అల్లు అర్జున్‌కు కొత్త బిరుదుల విషయంలో సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయనను ‘మెగాస్టార్’, ‘ఇండియాస్ బిగ్గెస్ట్ మెగాస్టార్’ అంటూ కొన్ని ఫ్యాన్ పేజీలు ట్రెండ్ చేయడానికి ప్రయత్నించాయనే ప్రచారం జరిగింది. అయితే ‘మెగాస్టార్’ అనే బిరుదు చిరంజీవితో బలంగా ముడిపడి ఉంది. ఇప్పుడు ‘రెబల్ స్టార్’ అనే ట్యాగ్ కూడా తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మరింత పెరిగింది.
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న హీరో. ‘పుష్ప’ తర్వాత ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో వరుసగా స్టార్ ట్యాగ్‌లపై వివాదాలు చెలరేగడం వల్ల అనవసరమైన ఫ్యాన్ వార్స్‌కు అవకాశం ఏర్పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

