ISRO | ఇది చారిత్రక విజయం.. జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం సక్సెస్పై ఇస్రో చైర్మన్ హర్షం
జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం భారత్ అంతరిక్ష కార్యక్రమంలో చారిత్రక విజయమని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు. 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05ను నిర్దేశిత కక్ష్యలోకి కచ్చితంగా ప్రవేశపెట్టామని, ఉపగ్రహం వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు
ISRO | జీఎస్ఎల్వీ-ఎఫ్17/ఈఓఎస్-05 ప్రయోగం భారత్ అంతరిక్ష కార్యక్రమంలో చారిత్రక విజయమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎస్ఎల్వీ-ఎఫ్17 వాహకనౌక 2,367 కిలోల బరువున్న అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-05ను నిర్దేశిత సబ్-జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి అత్యంత కచ్చితత్వంతో ప్రవేశపెట్టిందని తెలిపారు. రాకెట్లోని అన్ని వ్వయస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
107వ ప్రయోగం.. జీఎస్ఎల్వీకి 19వ మిషన్
శ్రీహరికోట నుంచి జరిగిన ప్రయోగాల్లో ఇది 107వ మిషన్ కాగా.. జీఎస్ఎల్వీ వాహకనౌకకు 19వ ప్రయోగమని నారాయణన్ తెలిపారు. జీఎస్ఎల్వీ తొలి ప్రయోగమైన డీ1లో 1,536 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని మాత్రమే మోసుకెళ్లగా.. నిర్మాణ రూపకల్పన, ప్రొపల్షన్ వ్యవస్థల్లో చేసిన నిరంతర అభివృద్ధితో రాకెట్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. తాజాగా 2,367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జీఎస్ఎల్వీ సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు.
ఈఓఎస్-05 అందుబాటులోకి వచ్చిన తర్వాత జియోసింక్రోనస్ కక్ష్యలో భారత్కు తొలి అంకిత భూ చిత్రీకరణ ఉపగ్రహంగా నిలవనుందని ఇస్రో ఛైర్మన్ తెలిపారు. జీఎస్ఎల్వీ-ఎఫ్17 విజయానికి ఇస్రో శాస్త్రవేత్తలు, పరిశ్రమ భాగస్వాములు, విద్యా సంస్థల సమష్టి కృషి కారణమని నారాయణన్ పేర్కొన్నారు. ఇస్రోలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం, సంస్థ అనుసరిస్తున్న ఓపెన్ వర్క్ కల్చర్, కఠినమైన సమీక్షా విధానాలు ఈ విజయానికి దోహదపడ్డాయని చెప్పారు. ఈ మిషన్ కోసం పనిచేసిన మాజీ ఇస్రో అధిపతులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వారి కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ISRO-Chief-Narayan says-GSLV-F17-Mission-EOS-05-is-historical success
“ఇది దేశ అంతరిక్ష కార్యక్రమంలో గొప్ప విజయం” అని నారాయణన్ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇస్రో మరో ఆరు ప్రయోగాలను చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణన్ వెల్లడించారు. వీటిలో ఈ ఏడాది చేపట్టనున్న మానవ రహిత గగన్యాన్ మిషన్ కూడా ఉందని తెలిపారు.
మిషన్ డైరెక్టర్ కురియన్ హర్షం
జీఎస్ఎల్వీ-ఎఫ్17 మిషన్ విజయంపై మిషన్ డైరెక్టర్ థామస్ కురియన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమందరికీ గొప్ప గర్వం, ఆనందం కలిగించే క్షణమని అన్నారు. ఈ ప్రయోగంతో జీఎస్ఎల్వీ 19వ మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. జీఎస్ఎల్వీ ఇప్పటివరకు జీటీఓ లేదా సబ్-జీటీఓ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల్లో ఈఓఎస్-05 అత్యంత బరువైనదని చెప్పారు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ కొద్ది నిమిషాల్లో పూర్తయినప్పటికీ.. దాని వెనుక నెలలు, సంవత్సరాల పాటు సాగిన కఠినమైన శ్రమ ఉంటుందని కురియన్ తెలిపారు. ఇస్రోలోని వివిధ బృందాలు సమన్వయంతో చేసిన నిరంతర కృషి ఫలితంగానే ఈ విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు.
#WATCH | Sriharikota, Andhra Pradesh: On the launch of GSLV-F17/EOS-05 mission, ISRO Chief V Narayanan says, “… This vehicle’s capability is 2250 kgs… The predicted performance of the approach was 29934 km, against that we have got 31000 kilometers, and this is the capability… pic.twitter.com/i9bQgP9hCw
— ANI (@ANI) September 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- EOS-05
- GSLV-F17
- ISRO
- ISRO Chairman
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

