Womens T20 League | తెలుగు నేలపై ఐపీఎల్ తరహా టీ20 లీగ్.. ఆగస్టులో ఆరంభం..!
Womens T20 League : పొట్టి క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిన ఐపీఎల్ పలు దేశాల్లో టీ20 లీగ్స్‌కు బీజం వేసింది. ఐపీఎల్ సూపర్ హిట్ కావడంతో మనదేశంలో మహిళా క్రికెట్ పురోగతిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)కు రూపమిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Womens T20 League : పొట్టి క్రికెట్ స్వరూపాన్ని మార్చేసిన ఐపీఎల్ పలు దేశాల్లో టీ20 లీగ్స్‌కు బీజం వేసింది. ఐపీఎల్ సూపర్ హిట్ కావడంతో మనదేశంలో మహిళా క్రికెట్ పురోగతిని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)కు రూపమిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ సంఘం (ACA) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ అభ్యున్నతి కోసం గతంలో నిర్వహించిన ఐపీఎల్ తరహా లీగ్‌ను పునరుద్ధరించాలని సంకల్పించింది. ఆదివారం విజయవాడలో జరిగిన వార్షిక సమావేశంలో ఏసీఏ ప్రతినిధులు ఈ తీర్మానానికి వచ్చారు.
ఇప్పటికే ఆరు పురుషుల జట్లతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తోంది ఏసీఏ. ఈ లీగ్ విజయవంతం కావడంతో మహిళా క్రికెటర్ల నైపుణ్యాలు మెరుగపరచడంతో పాటు వాళ్లకు జాతీయ జట్టుకు ఎంపికయ్యేలా చేయాలని ఏసీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకుముందు మహిళా క్రికెటర్లతో ఆంధ్రా ఉమెన్స్ టీ20 లీగ్‌ను నిర్వహించిన అనుభవమూ అసోసియేషన్‌కు ఉంది. మూడు జట్లు తలపడే ఈ టోర్నీ నిరుడు అర్ధాంతరంగా వాయిదా పడింది. అయితే.. ఈ ఏడాది మరొక జట్టును చేర్చి.. మొత్తంగా 4 టీమ్స్‌తో లీగ్‌ను జరపాలనే ఉద్దేశంతో ఉన్నారు క్రికెట్ సంఘం పెద్దలు.

‘మహిళా క్రికెటర్ల కోసం ఐపీఎల్ తరహాలో టీ20 లీగ్ జరపాలనే నిర్ణయం రాష్ట్రంలో మహిళల క్రికెట్ అభ్యున్నతి ఏసీఏ కృషికి నిదర్శనం కానుంది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్(విజయవాడ ఎంపీ), కార్యదర్శి ఎస్ సతీశ్ మహిళా క్రికెట్ పురోగతికి కట్టుబడి ఉన్నారు’ అని సోమవారం ఆంధ్రా క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. ఆగస్టులో మహిళల టీ20 లీగ్ నిర్వహణకు సన్నాహకాలు చేస్తున్నామని ఏసీఏ వర్గాలు తెలిపాయి.
మిథాలీ రాజ్ కన్వీనర్‌గా
కానీ, ఏకకాలంలో అటు పురుషుల, ఇటు మహిళల లీగ్ నిర్వహణ సవాల్‌గా మారనుంది. ఎందుకంటే.. స్టేడియం, ఆటగాళ్ల కిట్, ఇతర సామగ్రి.. వంటివాటిని తరలించడం ఖర్చు, సమయంతో కూడిన పని. అయినా సరే ఆగస్టులో రెండు లీగ్స్‌ను జరిపేందుకు ఏసీఏ సిద్దమవుతోంది. ప్రస్తుతానికి నిర్వహణ వ్యయం అంతా అసోసియేషన్ చూసుకోనుంది.
త్వరలోనే దీన్ని ఫ్రాంచైజీ లీగ్‌గా మార్చాలనే ఆలోచనతో ఉంది ఏసీఏ. టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj) ప్రస్తుతం ఏపీ మహిళా క్రికెట్‌కు కన్వీనర్‌గా వ్యవహరిస్తోంది. ఆమె సలహాలు సూచనలను ఆచరణలో పెడుతూ మహిళా క్రికెట్ కార్యక్రమాలను చూసుకునేందుకు త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది ఏసీఏ. అంతేకాదు పూర్తిగా మహిళా సభ్యులతో కూడిన సెలెక్షన్ కమిటీకి కూడా రూపమివ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
- World Test Championship: ఆసీస్ ఆటగాళ్లకు చేదు అనుభవం.. లార్డ్స్ లో ప్రాక్టీస్‌కు అనుమతి నిరాకరణ
- రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: వీర్లపల్లి శంకర్
- Herbal Teas | ఏయే హెర్బల్ టీలను సేవిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయంటే..?
- BRS Leaders | భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్య మార్గాల్లో ఉద్యమం.. నిరసనలో బీఆర్ఎస్ నేతలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

