ఢిల్లీ: భారత యువ స్కాష్ ప్లేయర్లు అన్హత్ సింగ్, అభయ్ సింగ్, వెలవన్ సెంథిల్‌కుమార్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లోకి వచ్చారు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టనున్న ఈ క్రీడలో పతకాల వేటకు ప్రణాళికలు రచిస్తున్న కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ.. ముగ్గురు స్కాష్ ప్లేయర్లను టాప్స్‌లో చేర్చింది. 16 ఏండ్ల అన్హత్ ప్రస్తుతం నేషనల్ చాంపియన్ కాగా ఆసియా అండర్ -17 చాంపియన్, రెండు పీఎస్ఎ వరల్డ్ టూర్ టైటిల్స్ నెగ్గింది