INDW vs AUSW : భారత పేసర్ అమన్‌జోత్ కౌర్ (1-17) బిగ్ బ్రేక్ ఇచ్చింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ సెంచరీ బాదేసిన ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(119)ను ఔట్ చేసింది. శతకం తర్వాత గేర్ మార్చి సిక్సర్లతో విరుచుకుపడుతున్న ఈ డాషింగ్ బ్యాటర్‌ను సూపర్ డెలివరీతో బోల్తా కొట్టించింది. అమన్‌జోత్ సంధించిన బంతిని లాప్ స్కూప్ షాట్ ఆడబోయిన లిచ్‌ఫీల్డ్ అంచనా తప్పింది. వికెట్ కీపర్ రీచా ఘోష్ తల మీదుగా సిక్ర్ కొట్టాలనుకున్న ఈ యంగ్‌స్టర్ క్లీన్‌బౌల్డ్ అయింది. దాంతో.. రెండో వికెట్‌కు అలీసా పెర్రీ(46 నాటౌట్)తో ఆమె నెలకొల్పిన 155 పరుగుల భాగస్వామ్యాన్నికి తెరపడింది. 29 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్.. 188-2.
సెమీఫైనల్లో భారీ స్కోర్ దిశగా సాగుతున్న ఆస్ట్రేలియాకు అమన్‌జోత్ కౌర్ షాకిచ్చింది. శతకంతో రెచ్చిపోయిన ఓపెనర్ ఫొబే లిచ్‌ఫీల్డ్(119)ను ఔట్ చేసి పరుగుల వరదకు బ్రేకులు వేసింది. అప్పటిదాకా 6కుపైగా రన్‌రేటుతో సాగిన ఆసీస్ ఇన్నింగ్స్ కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం అలీసా పెర్రీ (49 నాటౌట్) జతగా బేత్ మూనీ(7 నాటౌట్) క్రీజులో ఉంది.
Partnership broken! 👏
Amanjot Kaur rattles the stumps as Phoebe Litchfield walks back \|/
2️⃣nd wicket for #TeamIndia
Updates ▶ https://t.co/ou9H5gNDPT#WomenInBlue | #CWC25 | #INDvAUS pic.twitter.com/L5foliPrL3
— BCCI Women (@BCCIWomen) October 30, 2025