లాహోర్: ఆస్ట్రేలియా ఫీల్డర్ అలెక్స్ క్యారీ(Alex Carey) అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డేలో.. ఫిల్ సాల్ట్ కొట్టిన షాట్‌ను.. గాలిలోకి డైవ్ చేస్తూ క్యారీ క్యాచ్ పట్టేశాడు. బెన్ డ్వార్షిస్ బౌలింగ్‌లో.. మిడాన్ మీదుగా షాట్‌కు ప్రయత్నించాడు సాల్ట్. ఇక బౌండరీ వెళ్తుందనుకున్న ఆ షాట్‌కు.. అనూహ్య రీతిలో ఔటయ్యాడు బ్యాటర్. ఈ మ్యాచ్‌లో కీపర్‌గా కాకుండా ప్రధాన బ్యాటర్‌గా ఆసీస్ ప్లేయర్ అలెక్స్ క్యారీ బరిలోకి దిగాడు. అయితే మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అతను.. స్టన్నింగ్ రీతిలో క్యాచ్ అందుకున్నాడు. రెండు కాళ్లు గాలిలో ఉండగా.. కుడి చేతిలో ఆ క్యాచ్‌ను పట్టేశాడు. ఓ గోల్‌కీపర్ తరహాలో స్టంట్ చేశాడతను. కీపర్ తరహాలో డైవ్ చేస్తూ.. మిడాన్‌లో క్యారీ అందుకున్న క్యాచ్ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ వీడియోను మీరూ తిలకించండి.
WHAT. A. CATCH 🤯
Alex Carey with a spectacular catch to dismiss Phil Salt 👏 pic.twitter.com/gJIVOnC3WE
— Haydos🛡️ (@diablo_kells) February 22, 2025
ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 5.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 43 రన్స్ చేసింది. జేమీ స్మిత్ 15, సాల్ట్ 10 రన్స్ చేసి ఔటయ్యారు. బెన్ డకెట్ 10 రన్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.
🌟#ChampionsTrophy pic.twitter.com/I3DrEdc60a
— cricket.com.au (@cricketcomau) February 22, 2025