పారిస్: నయా స్పెయిన్ బుల్ కార్లొస్ అల్కరాజ్ ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. మంగళవారం రాత్రి ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఈ 21 ఏండ్ల కుర్రాడు.. 6-3,7-6 (7/3), 6-4తో తొమ్మిదో సీడ్ ‘గ్రీకు’ వీరుడు స్టెఫనోస్ సిట్సిపస్ను చిత్తు చేశాడు. సిట్సిపస్‌పై అల్కరాజ్కు ఇది వరుసగా 6వ విజయం కావడం గమనార్హం. ఆరంభంలోనే సిట్సిపస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్పెయిన్ కుర్రాడు.. గంటన్నర దాకా ప్రత్యర్థికి 4 పాయింట్లు మాత్రమే ఇచ్చి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు.
ఆ తర్వాత సిట్సిపస్ వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకుని పుంజుకోవాలని చూసినా డబుల్ ఫాల్ట్స్ చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ పోరులో జేమ్స్ పలోని 6-2, 4-6, 6-4తో నాలుగో సీడ్ ఎలీనా రిబాకినాకు షాకిచ్చింది. పలోనికి ఇదే తొలి గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్ కావడం విశేషం. ఇక పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ 7-6 (7/3), 5-7, 6-1తో సాండర్ గిల్లె-జోరాన్ వీజెన్ (బెల్జియం) ద్వయాన్ని ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించింది.