Australian Open : కొత్త ఏడాదిని టాప్ సీడ్స్ ఘనంగా ఆరంభించారు.ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాస్ (Carlos Alcaraz), మహిళల ఫేవరెట్ ఎమ్మా రాడుకాను (Emma Raducanu) అలవోక విజయంతో ముందంజ వేశారు. మెల్బోర్న్ పార్క్‌లో జరుగుతున్న ఈ గ్రాండ్‌స్లామ్ తొలి పోరులో 38 విన్నర్స్‌తో ఆడం వాల్టన్పై విరుచుకుపడిన అల్కరాస్ ఈ సీజన్లో మొదటి విజయం నమోదు చేశాడు.
తొలి రౌండ్లో అల్కారస్కు ఆడమ్ వాల్టన్ గట్టిపోటీనిచ్చాడు. తొలి సెట్ 6-3తో గెలుపొందిన స్పెయిన్ కుర్రాడికి షాకిస్తూ.. రెండో సెట్లో (7-6) ఒక్క పాయింట్‌తో సొంతం చేసుకున్నాడు ఆడమ్. అయితే.. నిర్ణయాత్మక సెట్లో జోరు చూపించిన అల్కరాస్ 6-2తో ప్రత్యర్ధిని మట్టికరిపించాడు. రెండో రౌండ్లో యన్నిక్ హన్ఫ్మన్తో అతడు తలపడనున్నాడు.
CARLOS ALCARAZ HITS AN UNREAL VOLLEY AGAINST WALTON AT THE AUSTRALIAN OPEN.
He’s literally diving full stretch but controls it perfectly and it drops right over the net.
Like… what? 🤯🤯🤯🤯
— The Tennis Letter (@TheTennisLetter) January 18, 2026
మహిళల సింగిల్స్‌లో బ్రిటీష్ టెన్నిస్ స్టార్ ఎమ్మా రాడుకాను పవర్ఫుల్ షాట్లతో ప్రేక్షకులను అలరించింది. అనారోగ్యం కారణంగా గతేడాది పలు టోర్నీలకు దూరమైన తను.. ఆస్ట్రేలియా ఓపెన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం జరిగిన తొలి రౌండ్లో థాయ్‌లాండ్‌కు చెందిన మనన్చయ సవాంగ్క్వేను వరుస సెట్లలో (6-4, 6-1) చిత్తుగా ఓడించింది. ఏకపక్ష విజయంతో ఎమ్మా రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.