హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా హ్యాండ్‌బాల్ క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్‌లో అల్ కువైట్ టైటిల్ విజేతగా నిలిచింది. గురువారం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో అల్ కువైట్ 28-23 తేడాతో అల్ నజ్మా(బహ్రెయిన్)పై అద్భుత విజయం సాధించింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రెండు జట్లు నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. టోర్నీ ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జాతీయ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, భారత ఒలింపిక్ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్‌పాండే తదితరులు పాల్గొన్నారు.